బెంగళూరు పట్టణ శివారులో ఓ సాఫ్ట్ వేర్ కారులో శవమై తేలిన సంఘటన కలకలం రేపింది. ఇంటి నుంచి పని ఉందని చెప్పి బయటకు వెళ్లిన టెక్కీ... ఇలా కారులో శవమై కనిపించడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే... అతనిది హత్యా, ఆత్మహత్య అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... బెంగళూరుకు చెందిన కార్తీక్ అనే యువకుడు నగరంలోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతని భార్య, ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. కాగా.. గురువారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన కార్తీక్...తిరిగి ఇంటికా రాలేదు. దీంతో... అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చేసుకున్న పోలీసులకు కార్తీక్ కారు బెంగళూరు పట్టణ శివారులో కనిపించింది. అందులో చూడగా.. కార్తీక్ మృతి చెంది కనిపించాడు. అయితే...  కారులో నిప్పు పెట్టుకొని... ఊపిరాడక చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. కార్తీక్ శరీరానికి స్వల్పంగా గాయాలు ఉన్నట్లు గుర్తించారు.

అతని ఫోన్ ఆధారంగా కార్తీక్ ది ఆత్మహత్యే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని ఫోన్ గత ముందు రోజు రాత్రి కారులో చనిపోవడం ఎలా అనే అంశంపై శోధించినట్లు తెలుస్తోంది. రాత్రంతా ఈ విషయంపై శోధించి తర్వాతి రోజు మధ్యాహ్నం చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.