Asianet News TeluguAsianet News Telugu

‘టీచర్ ప్లీజ్ ఒక్కసారి నాతో...’ చూసి నవ్వినందుకు... యువకుడి వేధింపులు.. చివరికి..

ఆమెతో లైంగిక జీవితం పొందాలని ఒత్తిడి చేశాడు. తనకు పెళ్లి అయిందని ఆమె చెప్పిన అతడి వైఖరిలో మార్పు రాలేదు. నీ భర్తను వదిలేసి నాతో వచ్చేయి.. నేను పెళ్లి చేసుకుంటానని వేధింపులకు గురి చేశాడు.

Teacher molested for promising marriage, Young man arrested - bsb
Author
Hyderabad, First Published Jul 28, 2021, 4:15 PM IST

ఓ కార్యక్రమంలో  ఉపాధ్యాయురాలిని చూశాడు. అతడిని ఆమె చూసింది.  అయితే అతడిని చూసి నవ్వడమే ఆమెకు శాపంగా మారింది. అప్పటినుంచి ఆ యువకుడు ఆమె వెంటపడుతూ తనను పెళ్లి చేసుకోవాలని వేధించసాగాడు.  తనకు పెళ్లయింది అని చెప్పినా వినకుండా వెంట పడ్డాడు.  ప్రేమ, పెళ్లి వద్దు స్నేహంగా ఉందాం.. అని ఆమె చెప్పగా.. మీతో ఒక్కసారి లైంగికంగా కలవాలని పట్టుబట్టాడు.

తీరా చూస్తే అతడు వేరే యువతులతో సంబంధాలు కొనసాగిస్తూ ఉండడంతో ఆమె అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.  కోజికోడ్ జిల్లా ఇరవన్నూర్‌కు చెందిన రంజిత్‌ ఒకసారి పాతనంతిట్టకు  చెందిన ఉపాధ్యాయురాలిని ఓ కార్యక్రమంలో చూశాడు. అతడిని పొరపాటున చూసిన ఆమె నవ్వడంతో అప్పటి నుంచి టీచర్ వెంటపడి వేధించ సాగాడు.

ఆమెతో లైంగిక జీవితం పొందాలని ఒత్తిడి చేశాడు. తనకు పెళ్లి అయిందని ఆమె చెప్పిన అతడి వైఖరిలో మార్పు రాలేదు. నీ భర్తను వదిలేసి నాతో వచ్చేయి.. నేను పెళ్లి చేసుకుంటానని వేధింపులకు గురి చేశాడు. అయితే అప్పటికే ఆమె భర్తకు దూరంగా ఉంటుంది. నిన్ను ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటా అని వెంట పడుతుండటంతో ఆమె కరిగిపోయింది. దీంతో అతడితో కలిసి సహజీవనం చేయసాగింది.

అతనితో కలిసి ఉంటున్న సమయంలోనే వేరే వారితో సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇది తెలిసి ఆమె రంజిత్ కు దూరంగా ఉంటుంది.  అయితే తనను వదిలేసి వెళ్లినా పర్లేదు కానీ ‘మీతో ఒక్కసారి కావాలి టీచర్ ప్లీజ్’ అని ఆమెతో శారీరక సంబంధం కోరాడు. రోజురోజుకీ అతడి వేధింపులు తీవ్రమయ్యాయి. 

ఆమెకు సంబంధించిన రహస్య ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఆమె పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నాడు. అతని ఆగడాలు భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  వెంటనే అప్రమత్తమైన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios