Asianet News Telugu

ఉపాధ్యాయుడి సెల్ఫీ మోజు.. ఉద్యోగానికి ఎసరు..!

పాఠశాలలు కొనసాగక పోయినా రోజూ హాజరై భోజన ఏజెన్సీ వంటమనిషిని రప్పించుకుని సెల్ఫీలు తీసుకో వడంతో పాటు ఆమెతో సన్నిహితంగా గడిపేవారు.
 

Teacher gets suspended after selfie with woman
Author
Hyderabad, First Published Jul 8, 2021, 1:14 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఓ ఉపాధ్యాయుడు తన సెల్ఫీ మోజుతో ఏకంగా తన ఉద్యోగానికే ఎసరు పెట్టుకున్నాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యాహ్న భోజన ఏజెన్సీ వంటమనిషితో సెల్ఫీతీసుకుని సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ పెట్టిన ఉపాధ్యాయుడు ఆంజనేయ నాయ్క సస్పెన్షన్‌ వేటుకు గురయ్యాడు. 

జగళూరు తాలూకా గోగుద్ది గ్రామ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి తీరుపై గ్రామస్తులలో ఆగ్రహం నెలకొంది. మద్యం సేవించి పాఠశాలకు రావడం, విద్యార్థులచే గుట్కాలు తెప్పించుకోవడం వంటివి చేసేవారు. పలుమార్లు స్థానికులు మందలించినా అతడిలో మార్పురాలేదు. పాఠశాలలు కొనసాగక పోయినా రోజూ హాజరై భోజన ఏజెన్సీ వంటమనిషిని రప్పించుకుని సెల్ఫీలు తీసుకో వడంతో పాటు ఆమెతో సన్నిహితంగా గడిపేవారు.

 జిల్లా విద్యాశాఖాధికారులకు సమాచారం చేరవేసినా ప్ర యోజనం లేకుండా పోయింది. విసుగుచెందిన గ్రామస్తులు సదరు సోషల్‌ మీడియా పోస్టింగ్‌లను విద్యాశా ఖామంత్రి సురేష్‌కుమార్‌కు పంపారు. వెంటనే మంత్రి స్పందిస్తూ డీడీపీఐను విచారణకు ఆదేశించారు. 

సదరు పోస్టింగ్‌లతో పాటు గ్రామస్తుల ఆరోపణలు వాస్తవమని తేలడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువమంది ఇతడికి వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు. డీడీపీఐ నివేదిక మేరకు ఉపాధ్యాయుడు ఆంజనే య నాయ్కపై సస్పెన్షన్‌ వేటు వేశారు. కాగా రెండేళ్ళ కిందట ఓ మహిళ వేధింపులకు గురిచేస్తున్నారని ఇదే ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios