క్రమశిక్షణకు, విలువలకు, మంచి పని వాతావరణానికి కేరాఫ్ అడ్రస్ టాటా గ్రూప్. అలాంటి చోట మేనేజర్‌ను కాల్చి చంపాడు ఓ ఉద్యోగి. వివరాల్లోకి వెళితే.. విశ్వాస్ పాండే అనే వ్యక్తి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఫరీదాబాద్‌లోని టాటా స్టీల్‌లో ఎగ్జిక్యూటీవ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు
క్రమశిక్షణకు, విలువలకు, మంచి పని వాతావరణానికి కేరాఫ్ అడ్రస్ టాటా గ్రూప్. అలాంటి చోట మేనేజర్‌ను కాల్చి చంపాడు ఓ ఉద్యోగి. వివరాల్లోకి వెళితే.. విశ్వాస్ పాండే అనే వ్యక్తి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఫరీదాబాద్‌లోని టాటా స్టీల్‌లో ఎగ్జిక్యూటీవ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
క్రమశిక్షణారహిత్యంతో పాటు తోటి ఉద్యోగుల నుంచి పలు ఫిర్యాదులు రావడంతో సీనియర్ మేనేజర్ అరిందమ్ పల్ విచార జరిపారు.. ఈ విచారణలో అతడిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో పాటు అతడిని విధుల నుంచి తప్పించారు.
అప్పటి నుంచి ఉద్యోగం లేక ఖాళీగా ఉన్న పాండే.. తనను క్షమించి తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాల్సిందిగా సీనియర్ మేనేజర్‌కు విజ్ఞప్తి చేశాడు. దానికి అతను లొంగకపోవడంతో.... తనతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పలుసార్లు హెచ్చరించాడు.
ఈ క్రమంలో నిన్న సాయంత్రం అరిందమ్ పల్ తన ఛాంబర్‌లో విశ్రాంతి తీసుకుంటుండగా విశ్వాస్ లోపలికి ప్రవేశించి... అందరూ చూస్తుండగానే పాయింట్ బ్లాంక్‌లో అతనిపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు.
దీంతో అరిందమ్ అక్కడికక్కడే మరణించాడు. పల్‌ను కాల్చి చంపిన అనంతరం పారిపోతున్న పాండేను పట్టుకునేందుకు మిగిలిన ఉద్యోగులు పట్టుకునేందుకు ప్రయత్నించడంతో తుపాకీతో బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు పాండే కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
