Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడు : 53 మంది ప్రభుత్వ న్యాయవాదుల తొలగింపు...

తమిళనాడు : మద్రాస్ హైకోర్టు, హైకోర్టు మదురై బెంచ్ లో అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం తరఫున వాదించేందుకు నియమితులైన 53 మంది న్యాయవాదులు పదవిని కోల్పోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ విజయం సాధించే పార్టీలు అధికారం చేపట్టాక, ప్రభుత్వ న్యాయవాదులను హైకోర్టులకు నియమించడం ఆనవాయితీ. 

tamilnadu state removes 53 govt lawyers - bsb
Author
Hyderabad, First Published Jun 8, 2021, 10:04 AM IST

తమిళనాడు : మద్రాస్ హైకోర్టు, హైకోర్టు మదురై బెంచ్ లో అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం తరఫున వాదించేందుకు నియమితులైన 53 మంది న్యాయవాదులు పదవిని కోల్పోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ విజయం సాధించే పార్టీలు అధికారం చేపట్టాక, ప్రభుత్వ న్యాయవాదులను హైకోర్టులకు నియమించడం ఆనవాయితీ. 

2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం పలువురు ప్రబుత్వ న్యాయవాదులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వ ప్రధాన న్యాయవాదిగా షణ్ముగసుందరం, ప్రధాన క్రిమినల్ న్యాయవాదిగా హసన్ మహహ్మద్ జిన్నా, మద్రాసు హైకోర్టు, హైకోర్టు బెంచ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు నియమితులయ్యారు. 

ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే హయాంలో నియమితులైన ప్రభుత్వ న్యాయవాదులు రాజీనామాను ప్రభుత్వం అంగీకరిస్తూ జీవో కూడా విడుదల చేసింది. అందులో, మద్రాసు హైకోర్టులో 108మంది, మదురై బెంచ్ లో 30 మంది తమ పదవులకు రాజీనామా చేయగా, ఇప్పటివరకు రాజీనామా చేయని 53 మంది ప్రభుత్వ న్యాయవాదులను తొలగించినట్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. 
 
Follow Us:
Download App:
  • android
  • ios