Asianet News TeluguAsianet News Telugu

శశికళకు ఫోన్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్.. ఆరోగ్యం గురించి ఆరా...

ఏఐఏడీఎంకే బహిష్కృత నేత శశికళ చెన్నైకి చేరుకున్నారు. కరోనా నుంచి కోలుకుని, తమిళనాడుకు చేరుకున్న శశికళకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేశారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని ఏఎంఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ, శశికళ సమీప బంధువు టీటీవీ దినకరన్ వెల్లడించారు. 

tamil superstar rajinikanth phone to sasikala - bsb
Author
hyderabad, First Published Feb 9, 2021, 3:21 PM IST

ఏఐఏడీఎంకే బహిష్కృత నేత శశికళ చెన్నైకి చేరుకున్నారు. కరోనా నుంచి కోలుకుని, తమిళనాడుకు చేరుకున్న శశికళకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేశారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని ఏఎంఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ, శశికళ సమీప బంధువు టీటీవీ దినకరన్ వెల్లడించారు. 

సూపర్ స్టార్ రజనీకాంత్ నాకు ఫోన్ చేశారు. చిన్నమ్మ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సుదీర్ఘ ప్రయణం చేసి ఆమె ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారు అని దినకరన్ మీడియాకు వెల్లడించారు. 

శశికళపై ప్రజల అభిమానంలో ఏ మార్పు లేదని, ఆమె ఏ తప్పూ చేయలేదని వారు నమ్ముతున్నారన్నారు. ఆమెకు లభించిన ఘన స్వాగతమే అందుకు నిదర్శనమని తెలిపారు. మా ప్రధాన ప్రత్యర్థి డీఎంకే. ఏఐఏడీఎంకేను ఓడించి, అమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకే ఏఎంఎంకేను ఏర్పాటు చేశాం. ఆ దిశగానే మేం ప్రయత్నం చేస్తున్నాం. శశికళ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం గురించి న్యాయ నిపుణుల సలహా తీసుకుంటాం. అని దినకరన్ వెల్లడించారు. 

అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శశికళ నాలుగేళ్లు శిక్ష అనుభవించి జనవరిలో విడుదలయ్యారు. ఇటీవల కోవిడ్ బారిన పడిన ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం కొంతకాలం బెంగళూరులోని ప్రెస్టీజ్ గోల్ఫ్ షైర్ క్లబ్ లో ఉన్నారు. 

అక్కడి నుంచి బయలు దేరిన ఆమె రోడ్డు మార్గంలో 23 గంటలు ప్రయాణించి, మంగళవారం ఉదయం చేరుకున్నారు. ఆమె ఇంటికి వెళ్లడానికి ముందు.. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసాన్ని సందర్శించారు. ఆమెకు నివాళులు అప్పించారు. 

ఏఐఏడీఎంకే సోమవారం ఏడుగురు పార్టీ నేతలపై వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే నెపంతో వారిని తొలగించింది. శశికళ సొంత రాష్ట్రానికి వచ్చే క్రమంలో తాను ప్రయాణిస్తోన్న కారుపై ఆ పార్టీ జెండాను ఉపయోగించారు. 

దీనిపై అధికార పార్టీ తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పార్టీ జెండాను తొలగించకుండా ఉండేందుకు పాలక పార్టీ నేతల కార్లను ఆమె ఉపయోగించినట్లు తెలిసింది. దాంతో ఆ నేతలపై పార్టీ చర్యలు తీసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios