తమిళనాడులోని (Tamil Nadu) విరుద్‌నగర్ జిల్లా‌లో న్యూ ఇయర్ వేళ విషాదం చోటుచేసుకుంది. శివకాశిలోని బాణసంచా ఫ్యాక్టరీలో (fireworks factory) భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతించెందారు. 

తమిళనాడులోని (Tamil Nadu) విరుద్‌నగర్ జిల్లా‌లో న్యూ ఇయర్ వేళ విషాదం చోటుచేసుకుంది. శివకాశిలోని బాణసంచా ఫ్యాక్టరీలో (fireworks factory) భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతించెందారు. శివకాశి సమీపంలోని సమీపంలోని మెట్టుపట్టి గ్రామంలో ఉన్న బాణసంచా ఫ్యాక్టరీలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాప సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred