Asianet News TeluguAsianet News Telugu

స్కూళ్ల రీ ఓపెనింగ్‌పై వెనక్కి తగ్గిన సర్కార్‌.. త్వరలోనే కొత్త తేదీలు..

కరోనా నేపధ్యంలో స్కూళ్ల రీ ఓపెనింగ్ పై తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రాష్ట్రంలో లాక్ డౌన్ ముందు మూతపడ్డ పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కరోనా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని పేర్కొంది. 
 
Tamil Nadu schools reopening postponed, new dates on reopening to release soon - bsb
Author
Hyderabad, First Published Nov 12, 2020, 1:09 PM IST

కరోనా నేపధ్యంలో స్కూళ్ల రీ ఓపెనింగ్ పై తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రాష్ట్రంలో లాక్ డౌన్ ముందు మూతపడ్డ పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కరోనా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని పేర్కొంది. 

ఇంతకుముందు ఈనెల 16నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతాయని,  9 నుంచి 12వ తరగతి విద్యార్థులు హాజరుకావాల్సిందిగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై చాలామంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు  అభ్యంతరం వ్యక్తం చేశారు. స్కూళ్లు తెరవడం అంటే తమ పిల్లలను కరోనాకు అప్పజెప్పడమే అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రస్తుతమున్న పరిస్థిత్లుల్లో స్కూళ్లకు అనుమతిస్తే కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరారు. స్కూళ్లు తిరిగి ప్రారంభించాలా వద్దా అన్నఅంశంపై దాదాపు 12వేల పాఠశాలలు సమావేశం అయినట్లు అధికారులు వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios