కంటికి రెప్పలా కాపాడాల్సిన కూతురిపైనే ఓ దుర్మార్గుడు కన్నేశాడు. కూతురిని లైంగికంగా వేధించాడు. తండ్రి పెడుతున్న లైంగిక వేధింపులు తాళలేక బాలిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ కామాంధుడైన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Also Read క్రైమ్ షోలు చూసి వేరే మహిళను చంపి ప్రేయసి మరణించినట్లు డ్రామా...

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ 45ఏళ్ల వ్యక్తి కన్నకూతురిపైనే కన్నేసాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిందిపోయి.. తన కామ వాంఛ తీర్చుకోవడానికి కూతురిని వాడుకున్నాడు. తండ్రి చేష్టలను తట్టుకోలేకపోయిన ఆ బాలిక మహిళా పోలీస్ స్టేషన్ ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ కి కాల్ చేసి తన బాధను వివరించింది.

ఫిర్యాదులో పేర్కొన్న చిరునామా ఆధారంగా పోలీసులు ఆ ఇంటికి చేరుకొని అక్కడున్న బాలికను విచారించగా, ఆ బాలికపై తండ్రి (40) లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో, నామక్కల్‌లో జరుగుతున్న ధ్యాన కూటములకు వెళ్లిన అతడిని పోలీసులు కుటుంబసభ్యుల ద్వారా ఫోన్‌ చేయించి రప్పించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా, ‘ఆయుష్షు గట్టిగా ఉండడం కోసమే కుమార్తెతో అలా ప్రవర్తించినట్లు’ తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు అతడిని పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.