తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆస్పత్రిలో చేరారు. ఎంకే స్టాలిన్‌కు మంగళవారం రోజున కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తాజాగా చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.  

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆస్పత్రిలో చేరారు. ఎంకే స్టాలిన్‌కు మంగళవారం రోజున కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో సెల్ప్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని స్టాలిన్ ట్విట్టర్ ‌ద్వారా వెల్లడించారు. ‘‘పరీక్షలో కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత నేను ఒంటరిగా ఉన్నాను. మనల్ని మనం రక్షించుకోవడానికి ఫేస్ మాస్క్‌లు ధరించి, వ్యాక్సిన్‌లు వేసుకుందాం’’ అని స్టాలిన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే తాజాగా ఆయన చెన్నై అల్వార్‌పేటలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కోవిడ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన.. దాని సంబంధిత లక్షణాల అబ్జర్వేషన్ కోసం ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని కావేరి హాస్పిటల్ యజమాన్యం ధ్రువీకరించింది. ఈ మేరకు హాస్పిటల్ యజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.