చెన్నై: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలని తమిళనాడు రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్ కు ఆదివారం నాడు సిఫారసుచేసింది.

 చెన్నైలో సీఎం పళనిస్వామి నేతృత్వంలో తమిళనాడు కేబినెట్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలని సిఫారసు చేసింది.

రాజీవ్ గాంధీ కేసులో మురుగన్, సంతన్, ఏజీపేరవిలన్, జయకుమార్, రవిచంద్రన్, రాబర్ట్ పాయస్ , నళిని శ్రీహరన్ జీవిత ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్నారు.

రాజీవ్ గాంధీ కేసులో శిక్షను అనుభవిస్తున్న పేరరివలన్ మెర్సీ పిటిషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేశాడు. అయితే ఈ పిటిషన్ ను గతంలోని తమిళనాడు ప్రభుత్వం తోసిపుచ్చింది.

అయితే అపెక్స్ కోర్టు ఈ పిటిషన్ పై గవర్నర్ ను ఈ పిటిషన్ పై అభిప్రాయం కోరింది. దీంతో ఈ విషయమై తమిళనాడు ప్రభుత్వం రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న ఏడుగురిని కూడ విడుదల చేయాలని కేబినెట్ ఇదివారం నాడు తీర్మానం చేసింది. 

ఈ మేరకు ఆదివారం నాడు పళనిస్వామి నేతృత్వంలో సమావేశమైన కేబినేట్ రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకొంది.ఈ తీర్మానాన్ని గవర్నర్ కు పంపనున్నారు.