డీఎండీకే అధినేత విజయకాంత్ ఎట్టకేలకు ప్రజల్లోకి వచ్చారు. బుధవారం గుమ్మిడిపూండి లో రోడ్ షో తో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇక ప్రచారంలో ఉన్న ప్రేమలత విజయకాంత్ కు అధికారులు షాక్ ఇచ్చారు. అమ్మ మక్కల్ కూటమితో కలిసి డీఎండీకే ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

అభ్యర్థులు 40 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఈ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళ్లే డీఎన్ఏ డీఎండీకే నేతలే కరువయ్యారు. విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత విరుదాచలంలో పోటీ చేస్తుండగా ఆమె ఆ నియోజకవర్గానికే పరిమితం అయ్యారు.

ఇతర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించడం పరిస్థితి ఉంది. ఇక విజయకాంత్ బావమరిది పార్టీ పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సుదీష్ కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో డీఎండీకే అభ్యర్థులకు మద్దతుగా కదిలే నేతలు ఆ పార్టీలో కరువయ్యారు.

ఈ పరిస్థితుల్లో అనారోగ్యంతో ఇంటికి లేదా కార్యాలయానికి పరిమితమైన విజయ్ కాంత్.. తన అభ్యర్థుల కోసం అడుగు బయట పెట్టకు తప్పలేదు. బుధవారం సాయంత్రం హఠాత్తుగా ఆయన ప్రచార పర్వంలోకి అడుగుపెట్టారు. విజయ్ కాంత్ ఎన్నికల ప్రచారంలో విరుదాచలంతో పాటుగా మరో నియోజకవర్గంలో ఓటర్లను కలిసేందుకు తొలుత నిర్ణయించారు.

అయితే తమకు మద్దతుగా ప్రచారం చేసే వాళ్లు లేరంటూ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు పెడుతున్న కేకలు విన్న విజయ్ కాంత్ తాను వస్తున్నానని అడుగు తీసి ముందుకు వేశారు. ఐదు రోజుల పాటు ఆయన ప్రచారం సాగనుంది బుధవారం సాయంత్రం గుమ్మిడిపూండిలో సుడిగాలి పర్యటనతో ముందుకు సాగారు. 

అయితే ఎక్కడా ప్రసంగాలకు తావివ్వలేదు. కేవలం పార్టీ వర్గాలను వాహనం నుంచి పలకరిస్తూ విజయ్కాంత్ ప్రచారం చేశారు. గురువారం తిరుత్తణిలో, శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు చెన్నైలో తమ అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారానికి ఆయన నిర్ణయించారు. 

సోదరుడు సుదీష్, ఆయన భార్య పూర్ణిమ ఇద్దరూ కరోనా బారిన పడటంతో ప్రేమలత విజయకాంత్ కు సంకటం తప్పలేదు. ఆమె విరుదాచలంలో సుడిగాలి పర్యటనతో ఓట్ల వేటలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఆమెకు అధికారులు షాక్ ఇచ్చారు. 
తప్పనిసరిగా కరోనా పరీక్షలు పరీక్షలు చేయించుకోవాల్సిందేనని, ఆ తరువాతే ప్రచారంలోకి వెళ్లాలని ఆరోగ్యశాఖ వర్గాలు హెచ్చరించాయి దీంతో కరోనా టెస్ట్ చేసుకోక తప్పలేదు. ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.