మహిళల నగ్న ఊరేగింపును సుమోటోగా తీసుకున్న సుప్రీం: చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఆదేశం
మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ:మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బయటకు వచ్చిన ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. ఈ ఘటనపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది సుప్రీంకోర్టు.
ఈ వీడియో తీవ్రంగా కలిచివేసిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ చెప్పారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత అవసరమైతే తాము జోక్యం చేసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. ఘర్షణల సమయంలో మహిళలను సాధనంగా ఉపయోగించడం రాజ్యాంగ దుర్వినియోగమని ఆయన అభిప్రాయపడ్డారు
. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.అమానవీయ ఘటన రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది.ఈ వీడియోలతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురౌతున్నారని సుప్రీంకోర్టు సీజేఐ చెప్పారు.
also read:అమానవీయ ఘటనలను ఎవరూ ఉపేక్షించరు: మణిపూర్ ఘటనపై మోడీ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు మణిపూర్ ఘటనలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఈ ఘటనపై ఆయన సీరియస్ గా తీసుకున్నారు.
ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు