కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పటికే మనదేశంలో 19లక్షల మందికి సోకింది. దాదాపు 40వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ వైరస్ కి మందు కోసం, వ్యాక్సిన్ కోసం అందరూ సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. దీనికి తాజాగా ఓ స్వామిజీ మందు కనిపెట్టారు.

కరోనాకి కొత్తగా వ్యాక్సిన్ , మందు ఏమీ అవసరం లేదని.. కేవలం మంచి నిద్ర.. సరైన ఆహారం ఉంటే సరిపోతుందని సుగుణేంద్ర స్వామిజీ తెలిపారు. కరోనా వైరస్ మనకు సోకినప్పుడే.. మనం దాని నుంచి కొత్త అనుభవాన్ని పొందగలుగుతామని ఆయన పేర్కొన్నారు.

దేశంలోని ప్రతి ఒక్కరూ మంచి లైఫ్ స్టైల్ కి అలవాటు పడేలా ప్రధాన నరేంద్రమోదీ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆయన ప్రధానికి విన్నపం చేశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకిందట. దాని నుంచి కోలుకున్న తర్వాత ఆయన తన అనుభవాన్ని మీడియాకు తెలియజేశారు.

కరోనా వైరస్ సోకిన వారికి దగ్గు ఎక్కువగా వస్తుందని... అది కూడా తెల్లవారు జామున 4గంటలకు మరింత ఎక్కువగా ఇబ్బంది పెడుతుందని ఆయన అన్నారు. ఎక్కువ సేపు నిద్రపోవడం.. మంచి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. తద్వారా త్వరగా కోలుకునే అవకాశం ఉందని చెప్పారు.

లేటుగా నిద్రపోవడం వల్ల కరోనాని కాస్త కంట్రోల్ చేయవచ్చని ఆయన చెప్పారు. త్వరగా నిద్రపోవడం వల్ల త్వరగా మెళకువ వస్తుందని.. దాని వల్ల దగ్గు ఇబ్బందిపెట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు. లేటుగా నిద్రపోతే.. ఉదయం లేవడం కూడా ఆలస్యం అవుతుందని.. దాని వల్ల ఉదయం వచ్చే దగ్గుని తగ్గించుకోవచ్చని చెప్పారు.