Asianet News TeluguAsianet News Telugu

డ్యాన్సింగ్ ఆన్ ది గ్రేవ్ : భార్యను సజీవ సమాధి చేసి.. దానిమీదే డ్యాన్సులు, పార్టీలు.. ప్రైమ్ వీడియోకు నోటీసులు

అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ అవుతున్న ఓ వెబ్ సిరీస్ ను వెంటనే నిలిపి వేయాలంటూ స్వామి శ్రద్ధానంద నోటీసులు పంపించాడు. 

swami shraddhanand sends legal notice to amezon prime video over a webseries - bsb
Author
First Published Apr 26, 2023, 3:26 PM IST

ఓ వెబ్ సిరీస్  ప్రసరణను తక్షణమే నిలిపివేయాలంటూ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న స్వామి శ్రద్ధానంద అలియాస్ మురళీ మనోహర్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ కేసులో ఆయన నిందితుడుగా ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కింది కావడమే దీనికి కారణం. ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కి విజయవంతంగా  ప్రేక్షకాదరణ పొందిన, పొందుతున్న సంగతి  తెలిసిందే.  

తాజాగా ఓ మర్డర్ మిస్టరీ కేసు మీద ఓ వెబ్ సిరీస్ వచ్చింది. . న్యాయవ్యవస్థకి ఈ మర్డర్ మిస్టరీ పెను సవాల్ గా మారింది. దీని ఆధారంగా అమెజాన్ ప్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ ను రూపొందించింది. దాని పేరే డాన్సింగ్ ఆన్ ద గ్రేవ్. మైసూర్ నవాబ్ మీర్జా ఇస్మాయిల్ మనవరాలు షాకిరే ఖలీలి ప్రేమ, పెళ్లి,   అదృశ్యం, హత్యలకు సంబంధించిన యదార్ధ ఘటనలతో ఈ సిరీస్ రూపొందింది. దీని మీదే మురళీ మనోహర్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశాడు. 

ఈ సిరీస్ ను ఇండియా టుడే, అమెజాన్ ప్రైమ్ వీడియోలు సంయుక్తంగా తెరకెక్కించాయి. వీటికి మురళీ మనోహర్ మిశ్రా తన లాయర్ ద్వారా నోటీసులు పంపించాడు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తాను రిట్ పిటిషన్ వేశానని చెప్పుకు వచ్చాడు. ఆ సమయంలో తన గురించి ఈ వెబ్ సిరీస్ తీయడం ద్వారా న్యాయాన్ని అతిక్రమించినట్లు అవుతుందని నోటీసుల్లో పేర్కొన్నాడు. ఈ వెబ్ సిరీస్ తన హక్కులను కాలరాస్తోందని..  అందుకే దీనిని వెంటనే నిలిపివేయాలని.. లేదంటే కోర్టుకు వెళ్తామని ఆ నోటీసుల ద్వారా తెలిపాడు.  

కొత్త వందే భారత్ రైలు కోచ్ లోకి వర్షపు నీరు లీక్.. కేరళలో ప్రధాని ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఘటన..

అంతేకాదు దీనికి అయ్యే ఖర్చు దాదాపుగా రూ.55వేల రూపాయలు అవుతుందని.. అది మీరే చెల్లించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించాడు. ఇంతకీ డాన్సింగ్ ఆన్ ది గ్రేవ్ డాక్యుమెంటరీలో ఏముంది… అంటే..షాకీరే ఖలీలి మైసూర్ దివాన్ మీర్జా ఇస్మాయిల్ మనవరాలు. చక్కటి అందగత్తె. ఆమెకు మొదట భారతీయ దౌత్య వేత్త ఇరాన్ అక్బర్తో పెళ్లయింది. దౌత్య వేత్త కావడంతో వృత్తిరీత్యా అనేక దేశాలు తిరిగి రావాల్సి ఉండడం.. ఎక్కువ కాలం విదేశాల్లో ఉండాల్సి రావడంతో భార్యతో దూరం పెరిగింది.  

ఈ దంపతులకు నలుగురు కూతుర్లు. దూరం పెరిగిన నేపథ్యంలో ఆమె అతనికి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత 1986లో ఆరు నెలల లోపే స్వామి శ్రద్ధానంద అలియాస్ మురళీ మనోహర్ మిశ్రమం పెళ్లాడింది. అయితే ఈ పెళ్లితో షాకీరే  తన కుటుంబానికి పూర్తిగా దూరమైపోయింది. కుటుంబానికి దూరమైన రెండో భర్తతో సంతోషంగా ఉందనుకున్నారు. కానీ షాకీరే 1991లో హఠాత్తుగా  కనిపించకుండా పోయింది. ఆ తర్వాత మూడేళ్లకు 1994 వరకు కూడా విచారణలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. 

ఆ తర్వాత షాకీరేను  తన ఇంటి పెరట్లోనే పాతిపెట్టినట్లుగా రెండో భర్త  శ్రద్ధానందా ఒప్పుకున్నాడు. వెంటనే పోలీసులు ఆ ప్రదేశంలో తవ్వి చూశారు. అక్కడ ఆమె ఆస్తిపంజరం దొరికింది. కాగా,  ఆమె బతికుండగానే నిద్రమాత్రలు ఇచ్చి సజీవ సమాధి చేశాడన్న వాదనలు వినిపించాయి. ఆమె చేతి గోర్లలో చెక్కపొట్టు ఇరుక్కుపోయి కనిపించింది. దీన్ని బట్టి. సజీవ సమాధి చేయబడ్డ. చెక్క పెట్టెలో నుంచి బయటికి రావడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నించిందని  ఆ తర్వాత రిపోర్టులోను వెల్లడయ్యింది. 

ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు నిందితుడు శ్రద్ధానందును దోషిగా నిర్ధారించింది.. యావజీవ కారాగార శిక్ష విధించింది. సుప్రీంకోర్టు విధించిన శిక్ష ప్రకారం  గత 30 ఏళ్లుగా అతని ఇప్పటికీ మధ్యప్రదేశ్ సాగర్లోని సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. భార్యను సమాధి చేసిన తర్వాత శ్రద్ధానంద ఆ సమాధి ప్రదేశం మీద పార్టీలు చేసుకున్నాడని.. డాన్సులు చేసేవాడని కొన్ని ఫోటోలు కూడా వెలుగు చూశాయి. 

దీని ఆధారంగానే ఈ సిరీస్ కు డాన్సింగ్ ఆన్ ది గ్రేవ్ అనే టైటిల్ ను నిర్మాతలు పెట్టారు. ప్రతీక్ గ్రాహం ఈ సిరీస్ కు దర్శకత్వం వహించాడు. నాలుగు ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ ను ఇండియా టుడే ఒరిజినల్ ప్రొడక్షన్ నిర్మించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios