Asianet News TeluguAsianet News Telugu

రేపు సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం: ఉప ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ

మరికొద్ది గంటల్లో బిహార్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎన్డీయే కూటమి తరుపున ముఖ్యమంత్రిగా జేయూ(డీ) అధినేత నితీష్‌ కుమార్‌ నాలుగోసారి సీఎంగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Sushil Modi to step down as deputy CM, Tarkishore Prasad might take over ksp
Author
Patna, First Published Nov 15, 2020, 8:01 PM IST

మరికొద్ది గంటల్లో బిహార్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎన్డీయే కూటమి తరుపున ముఖ్యమంత్రిగా జేయూ(డీ) అధినేత నితీష్‌ కుమార్‌ నాలుగోసారి సీఎంగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఆయనతో పాటు పలువురు మంత్రులు సైతం ప్రమాణం చేసే అవకాశం ఉంది. అంతా బాగానే వున్నప్పటికీ ఉప ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన సుశీల్‌ మోదీ స్థానంలో ఇద్దరు కొత్త వ్యక్తులను నియమిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వీరిలో ప్రధానంగా బీజేపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే తారక్‌ కిషోర్‌ ప్రసాద్‌తో పాటు రేణు దేవి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ నితీష్‌తో పాటు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు స్వీకర్‌ పదవి సైతం బీజేపీకే దక్కే అవకాశం ఉంది.

ఇక్కడ సుశీల్‌ మోదీ ఎందుకు తప్పుకున్నారు అనేది తెలియాల్సి ఉంది. డిప్యూటీ సీఎం పదవిపై సుశీల్‌ అంతగా ఆసక్తి చూపడంలేనట్లు బీజేపీ వర్గాల సమాచారం. అయితే నితీష్‌ కేబినెట్‌లో కీలకమైన శాఖలన్నీ బీజేపీకే దక్కే అవకాశం ఉండటంతో మంత్రివర్గంలోనే బలమైన శాఖను కట్టబెడతారని మరో ప్రచారం కూడా సాగుతోంది.

కాగా మంత్రి పదవుల కోసం బీజేపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. బీహార్ ఎన్నికల్లో 74 స్థానాలు బీజేపీ గెలుచుకోగా.. జేడీయూ 44 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. 76 స్థానాల్లో విజయకేతనం  ఎగరేసిన ఆర్జేడీ ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios