Asianet News TeluguAsianet News Telugu

ప్రధానిగా మళ్లీ నరేంద్ర మోడీ: రాహుల్ గాంధీ దిగదుడుపే

కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ పరిస్థితి దిగదుడుపుగానే ఉంది. కేవలం 8 శాతం మంది మాత్రమే రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు. ఆయన తల్లి, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వైపు కేవలం 5 శాతం మంది మాత్రమే మొగ్గు చూపారు. 

Survey Narendra Modi number one chaice as PM
Author
Hyderabad, First Published Aug 8, 2020, 11:30 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ ఏ మాత్రం తగ్గలేదు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీకి తిరుగులేదని, ప్రజల్లో ఆయనకు ఉన్న విశ్వాసం ఏ మాత్రం తగ్గలేదని ఓ తాజా సర్వేలో తేలింది. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన తదుపరి ప్రధానిగా ఉండాలని 66 శాతం మంది ప్రజలకు కోరుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది.

కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ పరిస్థితి దిగదుడుపుగానే ఉంది. కేవలం 8 శాతం మంది మాత్రమే రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు. ఆయన తల్లి, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వైపు కేవలం 5 శాతం మంది మాత్రమే మొగ్గు చూపారు. 

ప్రధానిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు 4 శాతం మంది మాత్రమే మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో యూపి సీఎం యోగి ఆదిత్యానాథ్ ( (3 శాతం), కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (1 శాతం) ఉన్నారు. ఇదిలావుంటే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వైపు 2 శాతం మంది మొగ్గు చూపారు. అంతే మంది కాంగ్రెసు ప్రియాంక గాంధీ ప్రధాని కావాలని అభిప్రాయపడ్డారు. 

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రధాని కావాలని అభిప్రాయపడినవారు కేవలం 1 శాతం మంది మాత్రమే. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకి కూడా ఒక్క శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. 

బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులు కూడా ‘నెక్ట్స్ పీఎం’ ప్రాధాన్య జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే- కార్వీ ఇన్‌సైట్స్‌ ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరిట చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కాగా కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో జులై 15, 2020 నుంచి జూలై 27, 2020 మధ్య 12,021 మందితో టెలిఫోన్‌ ఇంటర్వ్యూ ద్వారా వివిధ అంశాల్లో అభిప్రాయాలు సేకరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios