Asianet News TeluguAsianet News Telugu

2 నెలల కొడుకు కోసం చంద్రుడి మీద ఎకరం స్థలం.. !!

రెండు నెలల కొడుకు కోసం ఏకంగా చంద్రుడిమీద స్థలం కొన్నాడో తండ్రి. దీంతో గుజరాత్ లోని సూరత్ కు చెందిన విజయ్ భాయ్ కథిరియా చంద్రుడిమీద స్థలం కొన్న మొట్టమొదటి సూరత్ వ్యాపారిగ రికార్డుకెక్కాడు. 

Surat businessman buys a land on the moon for his two-month-old son - bsb
Author
Hyderabad, First Published Mar 26, 2021, 4:41 PM IST

రెండు నెలల కొడుకు కోసం ఏకంగా చంద్రుడిమీద స్థలం కొన్నాడో తండ్రి. దీంతో గుజరాత్ లోని సూరత్ కు చెందిన విజయ్ భాయ్ కథిరియా చంద్రుడిమీద స్థలం కొన్న మొట్టమొదటి సూరత్ వ్యాపారిగ రికార్డుకెక్కాడు. 

విజయ్‌ భాయ్‌ కథిరియా తన రెండునెలల కొడుకు  నిత్య కోసం చంద్రుడి మీద స్థలం కొనాలనుకున్నాడు. దీనికోసం అనుమతులు పొందటానికి న్యూయార్క్ లోని ఇంటర్నేషనల్ లూనార్ రిజిస్ట్రీకి మెయిల్ పెట్టాడు. 

వారు వ్యాపారి మెయిల్ కు స్పందించారు. మార్చి 13న అనుమతులు మంజూరు చేశారు. కొద్ది రోజుల తర్వాత సదరు కంపెనీ నుంచి విజయ్ కొడుకు నిత్య పేరు మీద ఓ ఎకరం స్థలం కొన్నట్లు సర్టిఫికెట్లు వచ్చాయి. 

చంద్రుడి మీదున్న ‘సీ ఆఫ్ మస్కోవీ’ అనే ప్రాంతంలో నిత్యకు స్థలం కేటాయించారు. మామూలుగా చంద్రుడిమీద స్థలం చూడడం సాధ్యంకాదు. అయితే చంద్రుడి మీద స్థలం కొన్నట్లు ఓ సర్టిఫికేట్‌ను మాత్రమే సంపాదించగలం. 

చాలామంది దీన్నే విలువైన బహుమతిగా భావిస్తుంటారు. గతంలో రాజస్థాన్ కు చెందిన ధర్మేంద్ర అనీజా అనే వ్యక్తి చంద్రుడి మీద మూడెకరాల స్థలం కొని భార్యకు బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios