భారత మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు సూరజిత్ సేన్‌గుప్తా గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా కరోనాతో, ఇతర ఆనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. హాస్పిటల్ వెంటిలేటర్ పై చికిత్స పొందున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో ఆయన చనిపోయారు. 

24 రోజుల పాటు కోవిడ్ (covid)తో పోరాడిన భారత మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు సూరజిత్ సేన్‌గుప్తా (Surajit Sengupta) (70) గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయ‌న‌కు భార్య శ్యామలి (Shyamali), కుమారుడు స్నిఘదేబ్ (Snighadeb) ఉన్నారు. సేన్‌గుప్తా కు క‌రోనా (corona) సోక‌డంతో చికిత్స కోసం కోల్‌కతా (kolkatha) లోని పీర్‌లెస్ (peerless) హాస్పిటల్‌లో ఆయ‌న చేరారు. గత మూడు వారాలుగా ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. అతని పరిస్థితి క్షీణించ‌డం మొద‌లు పెట్టింది. 10 రోజులుగా ఆయ‌న వెంటిలేట‌ర్ సపోర్ట్ తో చికిత్స పొందుతున్నారు. ఈ క్ర‌మంలో ప‌రిస్థితి విష‌మించ‌డంతో గురువారం రాత్రి మృతి చెందాడు. 

అత్యుత్తమ రైట్-వింగర్ (right-winger), అతి కొద్ది మంది ఎలైట్ బాల్-ప్లేయర్‌ ( elite ball-player)లలో ఒకరైన సేన్‌గుప్తా ఒక‌రు. ఆయ‌న మోహన్ బగాన్ (Mohun Bagan), ఈస్ట్ బెంగాల్ (East Bengal) రెండింటికీ ఆడారు. 1974,1978 ఆసియా క్రీడలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 10 సంవత్సరాల పాటు సాగిన సేన్‌గుప్తా క్లబ్ కెరీర్‌లో 14 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. ఈస్ట్ బెంగాల్ క్ల‌బ్ ఆయ‌న‌కు 2018లో సేన్‌గుప్తాకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందించింది.