ఒక్కో అసెంబ్లీ లేదా పార్లమెంట్‌ నియోజకవర్గంలో 100 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని  దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం నాడు కొట్టివేసింది.


న్యూఢిల్లీ: ఒక్కో అసెంబ్లీ లేదా పార్లమెంట్‌ నియోజకవర్గంలో 100 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం నాడు కొట్టివేసింది.

ఇదే విషయమై గతంలో 22 రాజకీయ పార్టీలు కనీసం 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ను కూడ సుప్రీంకోర్టు కొట్టివేసింది. వంద శాతం మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

మంగళవారం నాడు ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గంలో ఐదేసి ఈవీఎంలకు చెందిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది.