Asianet News TeluguAsianet News Telugu

పెళ్లితో బెయిల్ కి లింక్.. చేసుకుంటేనే ఇస్తానంటున్న సుప్రీంకోర్ట్..

లైంగిక దాడి ఆరోపణలు ఎదర్కొంటున్న ఓ పంజాబ్ యువకుడిని అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు శుక్రవారం స్టే మంజూరు చేసింది. ఆ యువకుడు బాధితురాలితో రాజీ పడ్డానని, బెయిల్ ఇస్తే పెండ్లి చేసుకుంటానని పిటిషన్ లో పేర్కొన్నాడు. అయితే కోర్టు మాత్రం అదేం కుదరదు పెండ్లి చేసుకుని వస్తేనే బెయిల్ మంజూరు చేస్తామని తేల్చి చెప్పింది. 

supreme court not accepting bail plea of a panjab youth - bsb
Author
Hyderabad, First Published Feb 12, 2021, 5:03 PM IST

లైంగిక దాడి ఆరోపణలు ఎదర్కొంటున్న ఓ పంజాబ్ యువకుడిని అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు శుక్రవారం స్టే మంజూరు చేసింది. ఆ యువకుడు బాధితురాలితో రాజీ పడ్డానని, బెయిల్ ఇస్తే పెండ్లి చేసుకుంటానని పిటిషన్ లో పేర్కొన్నాడు. అయితే కోర్టు మాత్రం అదేం కుదరదు పెండ్లి చేసుకుని వస్తేనే బెయిల్ మంజూరు చేస్తామని తేల్చి చెప్పింది. 

ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేసింది. బాధిత యువతి పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోని జాట్ సిక్కు కుటుంబానికి చెందిన ఒక యువకుడు ఆస్త్రేలియాలో ఉంటున్నాడు. 

2016లో ఆస్త్రేలియాలోనే సదరు యువతితో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమకు దారితీసింది. 2018-2019 మధ్య యువతితో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నాడు. ఆ తర్వాత యువతి పెండ్లి చేసుకోవాలని కోరగా, కులాలు వేరు కావడంతో తమ ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోవడం లేదని తిరస్కరించాడు. 

దీంతో బాధిత యువతి ఇండియాకు తిరిగొచ్చాక పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఇటీవల ఆ యువకుడు గుర్ దాస్ పూర్ కు రావడంతో యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 

ఈ నేపథ్యంలో తనకు బెయిల్‌ ఇవ్వాలని ఆ యువకుడు పెట్టుకున్న పిటిషన్‌ను పంజాబ్ హర్యానా హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆ యువకుడు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. చీఫ్‌ జస్టిస్‌ బొబ్డె నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్‌ వచ్చింది. 

వారి ముందు అతను తన వాదన వినిపిస్తూ బాధితురాలిని పెండ్లి చేసుకునేందుకు ఒప్పందం కుదురిందని, మరో ఆరు నెలల్లో పెళ్లి చేసుకునేలా అమ్మాయి కుటుంబాన్ని ఒప్పించానని కోర్టుకు తెలిపాడు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరాడు. 

ఈ మేరకు బాధితురాలితో చేసుకున్న ఒప్పందం కాపీని కూడా ఆ యువకుడా సుప్రీంకోర్టుకు సమర్పించాడు. అయితే, దీనికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. మొదట పెళ్లి చేసుకుని వస్తేనే బెయిల్ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేసింది. అదే సమయంలో ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేయకుండా స్టే ఇచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios