క్లౌడ్ బరస్ట్ వల్ల ఒక గ్రామానికి చెందిన 12 మంది మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్ లోని చసోటి గ్రామంలో ఇది జరిగింది. మచైల్ మాత యాత్రకు వెళ్లే దారిలో ఉన్న గ్రామం ఇది మృతుల సంఖ్య ఇంకా తిరిగే అవకాశం ఉంది. 

ధరాలి గ్రామంలో జరిగిన క్లౌడ్ బరస్ట్‌నే ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు మరొక గ్రామంపై మేఘ విస్పోటనం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోనే కిష్త్వార్ ప్రాంతంలోని చసోటి గ్రామంలో ఆకస్మికంగా క్లౌడ్ బరస్ట్ అయింది. దీంతో 12 మంది అక్కడకక్కడే మరణించారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. క్లౌడ్ బరస్ట్ అయిన ప్రాంతం మారుమూల ఏరియాలో ఉండడంతో అక్కడ నుంచి సమాచారం నెమ్మదిగా ప్రపంచానికి తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఇప్పటికే అమిత్ షాకు జరిగిన విషయాన్ని వివరించారు.

మచైల్ మాత యాత్ర కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగుడి ఉన్నారు. అదే సమయంలో మధ్యాహ్నం 12 గంటల నుండి ఒంటిగంట ప్రాంతంలో చసోటి గ్రామంలో భారీగా మేఘాలు ఒకచోట గుంపుగా చేరాయి. మాత ఆలయానికి వెళ్లే మార్గంలో చసోటి గ్రామమే చివరిది. కొండలకు దగ్గరగా ఉంటుంది.

ఉదయం పదకొండున్నర గురించి వార్త అధికారులతో జరిగింది. అక్కడి నుంచి పోలీసులు, ఇతర బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, వైమానిక దళాలు అన్ని ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. కానీ ఈ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రాణ నష్టం ఇంకా ఎక్కువే ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతదేహాల వెలికితీత కార్యక్రమం ఇంకా జరుగుతోంది. సహాయక చర్యలు పూర్తిగా అయ్యేవరకు కూడా మృతుల సంఖ్యను తేల్చలేమని చెబుతున్నారు అధికారులు.

ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు

కేంద్ర మంత్రులు ఈ విషయంపై స్పందించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడ ఉన్న ఎన్నో భవంతులు దెబ్బతిన్నాయి. అంతేకాదు ఈ వర్షాల కారణంగానే 241 మంది మరణించినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.