న్యూఢిల్లీలో పలుచోట్ల మంగళవారంనాడు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
న్యూఢిల్లీ: ఢిల్లీలో పలు చోట్ల మంగళవారంనాడు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.సుమారు 40 సెకన్ల పాటు ఢిల్లీలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నేపాల్ 6.2 తీవ్రతతో భూకంపం వచ్చిన కొద్ది సేపటి తర్వాత ఢిల్లీలో కూడ భూకంపం వచ్చింది. న్యూఢిల్లీలో భూకంప తీవ్రత 4.6 గా రిక్టర్ స్కేల్ పై నమోదైంది. ఈ భూకంప కేంద్రం నేపాల్ లో కేంద్రీకృతమైందని భూగర్భశాస్త్రవేత్తలు చెబుతున్నారు. న్యూఢిల్లీతో పాటు ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో కూడ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో కూడ భూకంపం వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

