జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాలపై ఉగ్రవాదుల దాడి : భారత్ లో భారీ పేలుళ్లకు స్కెచ్

Srinagar, Delhi on high alert as 12 terrorists sneak into J&K
Highlights

హైఅలర్ట్ ప్రకటించిన నిఘా వర్గాలు
 

జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు మరో సారి రెచ్చిపోయారు. ఏకంగా భద్రతా దళాల వాహనంపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఈ దాడిలో సీఆర్పిఎఫ్ వాహనం దెబ్బతింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అక్రమంగా ఇండియాలో చొరబడ్డ ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు పాల్పడి అలజడి సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మొత్తం 12 మంది జైషే మహ్మమద్ ఉగ్రవాదులు చొరబడ్డట్లు అనుమానిస్తున్నారు. వీరు భారత్ లో భారీ విద్వంసానికి ప్లాన్ చేశారని, అందువల్ల రెండు మూడు రోజులు  భద్రతా సిబ్బంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిఘావర్గాల హెచ్చరించాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, డిల్లీలలో హైఅలర్ట్ ప్రకటించారు.

భారత్ పవిత్ర రంజాన్ మాసంలో హింస సృష్టించాలని ఉగ్రవాదులు భారీ స్కెచ్ వేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వీరు భారీ ఎత్తున ఆయధాలను కలిగి వున్నారని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.

గత సంవత్సరం కూడా ఈ రంజాన్ మాసంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు పాల్పడిన విషయం తెలిసిందే. అలాగే ఈసారి కూడా దేశం మొత్తంలో గానీ, జమ్మూ కాశ్మీర్ లో గాని హింసకు ప్లాన్ చేసే ఇలా భారీసంఖ్యలో ఉగ్రవాదులు చొరబడిఉంటారని భద్రతా దళాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

loader