Asianet News TeluguAsianet News Telugu

చీర కట్టుకుని వస్తే నో ఎంట్రీ.. మహిళా జర్నలిస్టుకు రెస్టారెంట్ సిబ్బంది షాక్...

ఆమె చీరకట్టులో వచ్చినందుకు రెస్టారెంట్ సిబ్బంది లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. చీర సాధారణ క్యాజువల్ డ్రెస్ కోడ్ కిందకు రాదని, రెస్టారెంట్ లో కి కేవలం క్యాజువల్స్ నే అనుమతిస్తామని సిబ్బంది పేర్కొన్నారు. దీని మీద మహిళ ఎంత వాదించినా లోపలికి అనుమతించలేదు. 

South Delhi restaurant denies entry to woman in saree, netizens react angrily
Author
Hyderabad, First Published Sep 23, 2021, 9:27 AM IST

న్యూఢిల్లీ : మహిళలు చీర (Saree) కట్టుకోవడం భారతీయ సంస్కృతి, సంప్రదాయానికి (Tradition) నిలువెత్త నిదర్శనం. డ్రెస్, జీన్స్ వేసుకున్నా చీర కట్టుకుంటే వచ్చే గొప్పదనమే వేరు. అయితే దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో చీర కట్టుకుని రెస్టారెంట్ (Restaurant)కు వెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురయ్యింది. మహిళా జర్నలిస్ట్ అనితా చౌదరి తన కూతురు పుట్టిన రోజుని జరుపుకునేందుకు ఢిల్లీలోని అక్విలా రెస్టారెంట్ కు వెళ్లారు. 

అయితే ఆమె చీరకట్టులో వచ్చినందుకు రెస్టారెంట్ సిబ్బంది లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. చీర సాధారణ క్యాజువల్ డ్రెస్ కోడ్ కిందకు రాదని, రెస్టారెంట్ లో కి కేవలం క్యాజువల్స్ నే అనుమతిస్తామని సిబ్బంది పేర్కొన్నారు. దీని మీద మహిళ ఎంత వాదించినా లోపలికి అనుమతించలేదు. 

దీంతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అనితా చౌదరి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఢిల్లీలోని రెస్టారెంట్ లో చీర స్మార్ట్ అవుట్ ఫిట్ కాదట అంటూ పేర్కొన్న ఈ వీడియోలో ‘నాకు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను చీరలోనే పెళ్లి చేసుకున్నాను. చీర కట్టుకోవడం నాకు చాలా ఇష్టం. భారతీయ వస్త్ర ధారణ, సంస్కృతిని ప్రేమిస్తున్నాను. అయితే నిన్న నా కూతురు పుట్టిన రోజు జరుపుకునేందుకు అక్విలా రెస్టారెంట్ కు వెళ్లాం. మేము ముందే అక్కడ ఓ టేబుల్ బుక్ చేసుకున్నాం. కానీ నేను చీర కట్టుకున్నందుకు లోపలికి అనుమతించలేదు. 

బెంగళూరులో దారుణం: మహిళపై క్యాబ్ డ్రైవర్ రేప్, నిందితుడు ఆంధ్రావాలా

ఎందుకంటో భారతీయ చీర ఇప్పుడు స్మార్ట్ దుస్తులు కాదు. స్మార్ట్ ఔట్ ఫిట్ కు ఖచ్చితమైన నిర్వచనం ఏంటో నాకు చెప్పండి. ఎందుకంటే అప్పుడు నేను చీర కట్టుకోవడం మానేస్తాను. నా చీర కారణంగా జరిగిన అవమానం ఇప్పటివరకు నాకు జరిగిన అవమానాల కంటే పెద్దది. ఇది నా హృదయాన్ని కలిచివేసింది. అంటూ పేర్కొన్నారు. 

‘నాకు అదే విదంగా చీర కట్టుకోవడం మానేయడానికి ‘స్మార్ట్ దుస్తులకు’ కాంక్రీట్ నిర్వచనం చెప్పమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి, ఢిల్లీ సీఎం, ఢిల్లీ పోలీస్, జాతీయ మహిళా కమిషన్ ను ట్యాగ్ చేశారు. కాగా వీడియో చేసిన నెటిజన్లు రెస్టారెంట్ ప్రవర్తించిన తీరుపై మండిపడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios