తాంత్రిక పూజల పేరుతో ఓ మహిళ ప్రాణాలను తీశారు ఇద్దరు దంపతులు. వివరాల్లోకి వెళితే... జార్ఖండ్ రాష్ట్రం గర్వా ప్రాంతంలోని కొండిర గ్రామంలో రుడానీ దేవి అనే మహిళ కొద్దిరోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైంది.

ఇదే సమయంలో తాము తాంత్రిక పూజలతో రోగాలను నయం చేస్తామని చెప్పడంతో ఆలందేవి.. సత్యేంద్ర ఓరన్ అనే దంపతులను బాధితురాలి బంధువులు ఆశ్రయించారు. రుడానీదేవిని దుష్టశక్తులు ఆవహించాయని నమ్మించారు..

పూజలో భాగంగా ఒక పదునైన కత్తితో ఆమె కళ్తు పీకేశారు... ఒళ్లంతా పోట్లు పొడిచారు. అప్పటికే తీవ్ర అనారోగ్యంగతో బాధపడుతున్న రుడానీ దేవి వీరి చిత్రహింసలు తట్టుకోలేక మరణించింది.

దీంతో ఆమె శవానికి పంచనామా చేయించకుండానే ఖననం చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబసభ్యులను... రుడానీదేవి మరణానికి కారణమైన తాంత్రిక దంపతులను అరెస్ట్ చేశారు.