స్మృతి ఇరానీ...ఈ పేరు ఇప్పుడు రాజకీయంగా పెను సంచలనం. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు, యూపీఎ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీని ఓడించి సంచలన విజయాన్ని  అందుకున్నారు. ఎన్నోఏళ్లుగా ఉత్తర ప్రదేశ్ అమేథీ లోక్ సభలో కొనసాగుతున్న గాంధీ కుటుంబ పాలనకు స్మృతి చరమగీతం పాడారు. గత ఎన్నికల్లోనే రాహుల్ కు గట్టి ఫోటీ ఇచ్చి ఓడిపోయినా  కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఈసారి ఏకంగా అతన్ని ఓఢించారు కాబట్టి ఈ  ప్రభుత్వంలో ఆమెకు మరింత  ప్రాధాన్యత వుంటుందని రాజకీయంగా చర్చ జరుగుతోంది. 

రాహుల్ లాంటి ఉద్దండున్ని ఓడించడానికి స్మృతి తన కష్టాన్ని, దేవుడి ఆశిస్సులను నమ్ముకున్నారు. ఆమె కోరిక పలించి ఇటీవల వెలువడిన లోక్ సభ ఫలితాల్లో ఘన విజయాన్ని అందుకున్నారు. ఇలా ఫలితాలు  వెలువడిన మరుసటిరోజే ఆమె మొక్కు తీర్చుకోవడం ప్రారంభించారు. ముంబైలోని సిద్దివినాయక స్వామిని దర్శించుకోడాని స్మృతీ తన స్నేహితురాలు, ప్రముఖ  నిర్మాత ఏక్తా కపూర్ తో కలిసి పాదయాత్ర చేపట్టారు. చెప్పులు లేకుండా కాలినడకన దాదాపు 14 కిలోమీటర్లు నడిచిమరీ వీరు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. 

తన స్నేహితురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి చేసిన పాదయాత్ర, దైవదర్శనానికి సంబంధించిన ఫోటోలను ఏక్తా తన  ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. '' 14 కిలోమీటర్ల తర్వాత కాలినడక తర్వాత మా  ముఖాల్లో మెరుపు చూడండి'' అన్న క్యాప్షన్ తో ఈ ఫోటోలు పెట్టారు. ఈ ఆద్యాత్మిక యాత్రలో ఏక్తా నాలుగు నెలల తనయుడు కూడా భాగమయ్యాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

14 kms to SIDDHI VINAYAK ke baaad ka glow 😂

A post shared by Erk❤️rek (@ektaravikapoor) on May 27, 2019 at 11:08pm PDT