చనిపోయే ముందు కోటీ రూపాయల లావాదేవీలు.. కేరళ యువతి ఆత్మహత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు... !!
కేరళలో ఓ మహిళ మృతి అనుమానాస్పదంగా మారింది.చనిపోయేముందు ఆమె యూపీఐ యాప్ ద్వారా కోటి రూపాయల లావాదేవీలు చేసినట్టు వెల్లడవ్వడంతో కుటుంబసభ్యులు షాక్ అవుతున్నారు. ఉరివేసుకుని చనిపోయిన ఆ యువతి మృతి మీద పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
కేరళ : నిరుడు డిసెంబర్ లో కేరళలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఓ Mobile shopలో పనిచేసే బిజిషా అనే యువతి Suicide చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? చనిపోవాలన్నంత సమస్య ఏంటి? అనేది ఎవ్వరికీ అంతు పట్టని రహస్యంగా మారిపోయింది. అయితే ఆమె చనిపోయిన నెల తరువాత ఓ ఆసక్తి కరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
North Keralaలోని కోయిలాండిలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఒక నెల తర్వాత, ఆమె UPI యాప్‌లను ఉపయోగించి 1 crore విలువైన బ్యాంకు లావాదేవీలు జరిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని తెలిపారు. గతేడాది డిసెంబర్ 12న బిజీషా తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె మరణం తరువాత వెలుగులోకి వచ్చిన ఈ విషయం విని కుటుంబ సభ్యులు, బంధువులు షాక్‌కు గురయ్యారు. ఆమె సాధారణ మొబైల్ షాప్‌లో పనిచేసేదని..ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు ఎలా జరిపిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు బిజీషా పెళ్లి కోసం కుటుంబసభ్యులు దాచిపెట్టిన 280 గ్రాముల బంగారాన్ని కూడా ఆమె.. కుటుంబసభ్యులకు తెలియకుండా తాకట్టు పెట్టింది. విచారణలో ఈ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే బిజీషా ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె ఆత్మహత్యకు ఎటువంటి కారణం లేదని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే, ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన లావాదేవీ మొత్తం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ మిస్టరీని మరింత లోతుగా విచారించాలని పోలీసులను కోరుతూ స్థానికులు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు.
ఆమె తనకు తెలిసిన, పరిచయం ఉన్న వారందరినీ అప్పులు అడిగేదని.. వాటిని నగదు రూపంలో కాకుండా.. గూగుల్ పే వంటి UPI యాప్ ల ద్వారా ప్రత్యేకంగా పంపాలని కోరేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మొత్తం లావాదేవీ ఎందుకు చేసిందో, ఎవరి కోసం జరిపిందో కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా తెలియడం లేదు. వారికి ఇది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. అంత డబ్బు ఎందుకు ఖర్చు చేశారో ఎవరికీ తెలియదు.
అంతేకాదు బిజిషా తన UPI లావాదేవీకి సంబంధించిన సాక్ష్యాలను చెరిపివేయడానికి కూడా ప్రయత్నించింది. దీంతో ఆమె బ్యాంకు లావాదేవీలపై పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు కోటి రూపాయల లావాదేవీలు జరిగినా.. బిజీషా చనిపోయిన తర్వాత డబ్బులు అడగడానికి ఎవరూ ఇంటికి రాలేదన్నారు. బిజీషాకు ఏం జరిగింది? ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? డబ్బుల ట్రాన్సాక్షన్ వెనక ఎవరున్నారు? అనేది మిస్టరీగా ఉందని స్థానికులు చెబుతున్నారు.