Asianet News TeluguAsianet News Telugu

భోజనంలో మత్తుమందు కలిపి మహిళపై అత్యాచారం..

తాను తినే భోజనంలో మత్తుమందు కలిపి తన మీద అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ తరువాత బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

six men arrested for drugging, raping a woman in new delhi
Author
First Published Jan 13, 2023, 11:45 AM IST

న్యూఢిల్లీ : తాను పనిచేసే సంస్థ మేనేజర్ తనకు మత్తుమందు కలిపిన ఆహారాన్ని ఇచ్చి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. ఈ ఘటన సంచలనం రేపింది. తనను..  బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెలిపింది. మహిళ ఫిర్యాదు మేర ఢిల్లీ పోలీసులు అతని మీద కేసు నమోదు చేశారు.  తాను ఓ యాప్ లో మేనేజర్.. తన అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించాడని.. అలా బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. 

మేనేజర్ తో పాటు అతని సహచరులు కూడా తన మీద వేధింపులకు పాల్పడుతున్నారని మహిళ ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు సదరు నిందుతులు ఐదుగురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 376, 377, 506, 34, ఐటీ చట్లం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాము నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని.. దాడులు నిర్వహిస్తున్నామని సదర్ పోలీస్ స్టేషన్.. స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వేదర్ ప్రకాష్ తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios