ముంబై: సంక్రాంతి పండుగ పూట మహారాష్ట్రలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నర్మదా నదిలో పడవ మునిగి ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదం మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో మంగళవారం సంభవించింది. ప్రమాదం సంభవించినప్పుడు పడవలో 60 మంది ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 

ఇప్పటి వరకు 36 మందిని రక్షిం్చారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. మకర సంక్రాంతి పర్వదినం సందర్బంగా నదీమ తల్లికి పూజలు చేయడానికి పడవలో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గిరిజనులు అత్యధికంగా ఉండే నందుర్బార్ జిల్లాలోని గ్రామానికి చెందినవారు మరణించినట్లు అధికారులు చెప్పారు. 

సామర్థ్యం కన్నా ఎక్కువ మంది ఎక్కడం వల్ల ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.