సింగపూర్ పార్లమెంటు చర్చల్లో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను ఆ దేశ ప్రధాని ప్రస్తావించారు. వర్కర్స్ పార్టీ మాజీ చట్టసభ్యుడు పార్లమెంటులో అసత్యం పలికాడన్న ఓ తీర్మానంపై సింగపూర్ ప్రధాని మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో వ్యవస్థాపక నేతలుగా ఉన్నవారు ఎంతో ఆదర్శంగా, ఉన్నత విలువలతో ప్రజల అంచనాలకు అనుగుణంగా నడుచుకున్నారని వివరించారు. కానీ, దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ నేతల్లో మార్పులు వస్తాయని, తొలి తరం నేతల బాటలో నడవాలంటే సవాళ్లతో కూడుకున్న పనిగా మారుతుందని తెలిపారు. =
న్యూఢిల్లీ: స్వతంత్ర భారత దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ గుర్తింపును పొందిన నేత. భారత దేశంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన ప్రధానిగా పేరుపొందారు. తాజాగా, సింగపూర్(Singapore) పార్లమెంటులో చర్చ(Parliamentary Debate) జరుగుతుండగా ఆ దేశ ప్రధానమంత్రి లీ సియెన్ లూంగ్.. భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతుందనే అంశంపై మాట్లాడుతూ ఆయన నెహ్రూను గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఎలా రక్షించుకోవాలని మాట్లాడుతూ ఆయన పలువురు కీలక నేతలను ఉటంకించారు.
ఉన్నత ఆదర్శాలు, సమున్నత విలువలపై ఎన్నో దేశాల పునాదులు నిర్మించారని ఆయన పేర్కొన్నారు. కానీ, దేశ నిర్మాణానికి వ్యవస్థాపకులుగా వ్యవహరించిన నేతలు, అప్పటి ఆదర్శవంతమైన తరం జాతి నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారని వివరించారు. అయితే, ఆ విలువలు, నేతల ఆదర్శాలు, ప్రజల్లోనూ అనేక మార్పులు మెల్లగా వస్తూ ఉంటాయని తెలిపారు. ముందుగా ఎంతో ప్యాషనేట్‌గా పరిస్థితులు పురోగమిస్తాయని వివరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నేతలు.. ఆదర్శంగా నడుచుకుంటారని అన్నారు. ధీరత్వం, సాంస్కృతిక విలువు, ఎంతో సామర్థ్యాన్ని వారు ప్రదర్శించారని పేర్కొన్నారు. వారంత జాతికే అంకితమైన నాయకులుగా ఎదిగారని, వారు ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను, సవాళ్లను ఎదుర్కొని ఉత్తమ నేతలుగా, జాతీయ నాయకులుగా ఎదిగారని తెలిపారు. వారిలో డేవిడ్ బెన్ గురియన్స్, జవహర్‌లాల్ నెహ్రూలు సహా ఎందరో ఉన్నారని, మన దేశానికి అలాంటి ఉన్నతమైన నేతులు ఉన్నారని వివరించారు. వర్కర్స్ పార్టీ మాజీ చట్టసభ్యుడు రాయీసా ఖాన్ అసత్యం చెప్పాడన్నదానిపై వేసిన కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్‌పై మంగళవారం ఆయన మాట్లాడారు.
వ్యక్తిగత ప్రతిష్టలు, స్వాభిమానం నింపుకున్న నేతలు ఆ దేశ ప్రజల అంచనాలను అందుకుంటారని, ఒక కొత్త ప్రపంచం వారి కోసం సృష్టిస్తారని తెలిపారు. వారి దేశాలకు ఒక కొత్త భవిష్యత్‌ను నిర్మించాలని వివరించారు. అయితే, తొలితరం నేతలు అంత ఆదర్శంగా నిలిచినా.. దశాబ్దాల తర్వాత నేతల వ్యవహారంలో, నడవడికలో మార్పులు వస్తాయని తెలిపారు. అప్పటి ఆదర్శాలను ఎత్తిపట్టుకోవడం సవాలుతో కూడుకున్నట్టిదిగా మారుతుందని చెప్పారు.
ఒకప్పడు నెహ్రూ పుట్టిన దేశంలోనూ కొన్ని మీడియా కథనాల ప్రకారం చట్టసభ్యుల్లో నేర అభియోగాలు ఎదుర్కొంటున్నవారు ఉన్నారని సింగపూర్ ప్రధాని లీ వివరించారు. నేడు భారత లోక్‌సభలోని సగం మంది ఎంపీలు నేరపూరిత అభియోగాలను ఎదుర్కొంటున్నవారే ఉన్నారని చెప్పారు. అందులో రేప్, మర్డర్ అభియోగాలూ ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, అందులోనూ చాలా నేరాలు రాజకీయ ప్రేరేపితమైనవని మరికొన్ని కథనాలు ఉన్నాయని చెప్పారు.
ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ మండిపడ్డారు. ప్రధానమంత్రి పొజిషన్ అంటే ఒక స్టేచర్ ఉంటుందని, దాని డిగ్నీటిని మంటగలపవద్దని విమర్శించారు. మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చరిత్రను వక్రీకరించవద్దని అన్నారు. మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆంగ్లేయులు అవలంబించిన విభజించు పాలించు అనే పాలనా విధానాన్ని పాటిస్తున్నదని ఆరోపించారు.
