సిక్కింలో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. సిక్కింలోని రావంగ్లాలో రిక్టర్ స్కేల్‌పై 3.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (National Center for Seismology) వెల్లడించింది. 

సిక్కింలో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. సిక్కింలోని రావంగ్లాలో రిక్టర్ స్కేల్‌పై 3.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (National Center for Seismology) వెల్లడించింది. తెల్లవారుజామున 3.01 గంటలకు భూమి కంపించిందని పేర్కొంది. రావన్‌గ్లా ప్రాంతానికి 12 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని ఎన్సీఎస్ తెలిపింది. ఐదు కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నట్టుగా పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలను National Center for Seismology ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. 

భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో జనం భయాందోళన చెందారు. రాత్రి సమయంలో భూప్రకంనలు చోటుచేసుకోవడంతో అప్పటికే నిద్రలో ఉన్న జనాలు.. ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారని ఒక అధికారి తెలిపారు. అయితే భూ ప్రకంపనల వల్ల ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారి చెప్పారు.

Scroll to load tweet…

శ్రీ‌కాకుళంలో భూప్రకంప‌నాలు..
శ్రీకాకుళం జిల్లాలో గత రాత్రి ప‌లు చోట్ల స్వల్పంగా భూకంపం సంభవించింది. మంగ‌ళ‌వారం రాత్రి రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాల్లో భూమి కంపించింది. నిలుచున్న వ్యక్తులు కింద పడిపోయినట్లు అనిపించడం.. శబ్దాలతో గోడలకు పగుళ్లు రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. గత వారం రోజుల్లో ఇది రెండోసారి. కావ‌డంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొన్నిచోట్ల ఇళ్లలో పాత్రలు కింద పడిపోవడంతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.