Lucknow: లక్నోలోని కైసర్‌బాగ్ ప్రాంతంలో రిటైర్డ్ టీచర్ నివాస‌ముంటున్నారు. ఆమె కొడుకు రెండు కుక్క‌ల‌ను పెంచుకుంటున్నారు. ఆ కుక్కలే వారి ఇంట్లో పెనువిషాదం నింపాయి.   

Uttar Pradesh: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ రిటైర్డ్ టీచ‌ర్ ను రెండు పెంపుడు కుక్క‌లు క‌రిచి చంపేశాయి. ఈ ఘ‌ట‌న ల‌క్నోని కైస‌ర్ బాగ్ ప్రాంతంలో జ‌రిగింది. వివ‌రాల్లోకెళ్తే.. మంగళవారం ఉదయం లక్నోలోని కైసర్‌బాగ్ ప్రాంతంలో 82 ఏళ్ల రిటైర్డ్ టీచర్‌ను ఆమె కొడుకు పెంపుడు పిట్‌బుల్ కుక్క కరిచి చంపింది. లక్నోలోని కైసర్‌బాగ్ ప్రాంతంలో రిటైర్డ్ టీచర్ నివాస‌ముంటున్నారు. ఆమె కొడుకు కూడా అక్క‌డే ఉంటున్నారు. ఆమె కొడుకు రెండు కుక్క‌ల‌ను పెంచుకుంటున్నారు. అవి పిట్‌బుల్, లాబ్రడార్ రకానికి చెందినవి. ఆమె ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో ఆమెపై దాడి చేసి ప్రాణాలు తీశాయి. మృతురాలిని సుశీలా త్రిపాఠిగా గుర్తించారు. ఆమె కుమారుడు, అమిత్ ఒక జిమ్ ట్రైనర్. రెండు పెంపుడు కుక్కలను కలిగి ఉన్నాడు. అవి పిట్‌బుల్, లాబ్రడార్. మహిళపై దాడి చేసిన బ్రౌనీ అనే కుక్కను మూడేళ్ల క్రితం ఇంటికి తీసుకొచ్చారు. కైసర్‌బాగ్‌లోని బెంగాలీ తోలా ప్రాంతంలో కుటుంబం నివసించేది.

మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కుక్క ఆమెపై తీవ్రంగా దాడి చేసింది. అనంతరం రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను కొడుకు గుర్తించాడు. రక్తం ఎక్కువగా పోవడంతో ఆమెను బలరాంపూర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం సుశీల శరీరంపై మెడ నుంచి పొత్తికడుపు వరకు మొత్తం 12 బలమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు.

ఇరుగుపొరుగువారు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. "ఉదయం 6 గంటల సమయంలో, కుక్కలు అరుపులు వినిపించాయి. అలాగే, సుశీల సహాయం కోసం కేకలు వేయడం వినిపించింది. దీంతో మేము వారి ఇంటికి పరిగెత్తాము. అయితే, లోప‌లి నుంచి డోర్ లాక్ చేసి ఉంది. దీంతో త‌లుపులు తెర‌వ‌డానికి వీలుప‌డ‌లేదు. మహిళ కుమారుడు ఇంటికి చేరుకున్న త‌ర్వాత త‌లుపును విర‌గొట్టాడు. ఈ క్ర‌మంలో అత‌నికి కూడా గాయాల‌య్యాయి" అని చెప్పారు. 

లక్నో మునిసిపల్ కార్పొరేషన్ (LMC) స్వన్ లైసెన్స్ కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ బై-లా 2003 పేరుతో కుక్కల పెంపకం కోసం ఒక మాన్యువల్‌ను జారీ చేసింది. మాన్యువల్ ప్రకారం కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడే వ్యక్తులు అనేక షరతులకు కట్టుబడి తప్పనిసరిగా లైసెన్స్ పొందవలసి ఉంటుంది. ఏ వ్యక్తి అయినా తన కుక్కను పొరుగువారికి ఎలాంటి అభ్యంతరం లేని విధంగా ఉంచి బంధించాలని మాన్యువల్‌లో పేర్కొంది. లక్నో నగరంలో మొత్తం 4,824 లైసెన్స్‌లు జారీ చేయగా, వాటిలో 2,370 పెద్ద జాతి కుక్కలకు సంబంధించినవి.