Asianet News TeluguAsianet News Telugu

అది ఫేక్.. అసలు ఆమె మీద అత్యాచారమే జరగలేదు.. మెడికల్ రిపోర్టులో షాకింగ్ విషయాలు...

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ముంబై మహిళ అత్యాచారం, ప్రైవేట్ పార్ట్స్ లో పదునైన ఆయుధాలు, సిగరెట్లతో కాల్చి చిత్రహింసలకు గురిచేయడం ఘటన ఫేక్ అని తేలింది. 

shocking facts revealed in woman Gang-Raped, Attacked With Sharp Weapon,Cigarettes On Private Parts case in mumbai - bsb
Author
First Published Jan 19, 2023, 11:58 AM IST

ముంబై : ఓ మహిళ మీద ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ మీద సిగరెట్లతో కాల్చి చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటనను మొత్తం వీడియో తీసి ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. వారి నుంచి ఎలాగో తప్పించుకున్న ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు.  ఇటీవల ఆమె ఆరోపించిన సదరు నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారించే క్రమంలో వెలుగు చూసిన విషయాలు పోలీసులను దిగ్భ్రాంతికి గురి చేశాయి.

 దీనికి తోడు మెడికల్ రిపోర్టుల్లో బయటపడిన  విషయాలు షాక్ కు గురిచేశాయి. ఆ మహిళ మీద అసలు అత్యాచారమే జరగలేదన్న విషయం తెలియడంతో పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 2022 నవంబర్లో ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఓ అత్యాచార కేసు సంచలనంగా మారింది.  ఓ మహిళ తలపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేయడంతో పాటు తనను  పదునైన ఆయుధాలు, సిగరెట్ల తో  తన ప్రైవేట్ పార్ట్స్ లో గాయాలు చేసి..చిత్రహింసలకు గురి చేశారని.. దానంత వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నాలుగు నెలల్లో చార్‌ధామ్ యాత్ర.. జోషిమఠ్‌లో 70 శాతం ప్రజలు సాధారణ జీవితం గుడపుతున్నారు: ఉత్తరాఖండ్ సీఎం

ఈ కేసు అప్పట్లో ముంబైలో సంచలనంగా మారింది. మహిళా కమిషన్ కూడా ఈ కేసును సీరియస్గా తీసుకుంది. వెంటనే కేసును పరిష్కరించాలని నిందితులను అరెస్టు చేయాలని పోలీసులకు  ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 40 రోజుల క్రితం ఈ ముగ్గురు నిందితులలో ఒకరైన బబ్లు అలియాస్ మహమ్మద్ యాకూబ్ సిద్ధికిని అరెస్టు చేశారు. అతనిని జైల్లో వేశారు.  

మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అయితే ఇటీవల ఆ మహిళకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు వచ్చాయి. అది చూసిన పోలీసులు షాక్ అయ్యారు. ఆ మెడికల్ రిపోర్టులో ఆ మహిళపై ఇలాంటి అత్యాచారం జరగలేదని తేలింది. దీంతో మహిళను విచారించగా.. డ్రగ్ సరఫరాలో మహిళకు ఆ ముగ్గురు యువకులకు వివాదం తలెత్తిందని.. ఈ కారణంగానే వారి మీద ప్రతీకారం తీర్చుకునేందుకే మహిళ ఇలా ఫిర్యాదు చేసినట్లు తేలింది. దీంతో ఆమె మీద పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios