మహారాష్ట్ర ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన కాంగ్రెస్, ఎన్సీపీలపై శివసేన ప్రశంసల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో శివసేన అధికారిక పత్రిక ‘‘సామ్నా’’లో.. తమ మిత్రపక్షమైన బీజేపీని ప్రస్తావించకుండా ఎన్సీపీని ఆకాశానికెత్తేసింది.

ప్రత్యేకంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ గురించి రాస్తూ కమలనాథులపై విమర్శల వర్షం కురిపించింది. పార్టీ మారిన వారి సాయంతో ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు.. సతారాలో ఉదయ్‌రాజే భోస్లే భారీ ఓటమి చవి చూడటంతో ఈ విషయం మరోసారి రుజువైందని చురకలంటించింది.

గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్సీపీ కూటమిని విజయావకాశాలను ఎంఐఎం దెబ్బతీసింది. ఔరంగబాద్ జిల్లా పరిధిలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అభ్యర్ధుల విజయాన్ని ఎంఐఎం దెబ్బతీసింది.

Also Read:మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం దెబ్బ: కాంగ్రెస్ ఢమాల్, బీజేపీ కూటమి జోరు

ఔరంగబాద్‌ పరిధిలో ముస్లిం ఓట్లను ఎంఐఎం గణనీయంగా చీల్చింది. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీ అభ్యర్ధులు ఓటమి పాలయ్యారు. ఈ స్థానాల్లో బీజేపీ, శివసేన అభ్యర్ధుల విజయం వైపుగా దూసుకుపోయారు. 

మహారాష్ట్రలో ఎంఐఎం ఈ దఫా 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. ఎంఐఎం అన్నింటిలో కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి అభ్యర్థుల మధ్యే ఎంఐఎం ముఖాముఖి పడింది. ఔరంగబాద్, బీడ్, కొల్హాపూర్, అహ్మద్‌నగర్‌ లాంటి చోట్ల మైనార్టీలు ఎంఐఎం వైపుకు మొగ్గుచూపారని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి..  

రైతుల,రైతాంగ సమస్యలు ఈ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నా, మోడీ ఇమేజ్ వల్ల, సరైన ప్రతిపక్షం లేని కారణంగా ఇక్కడ బీజేపీ శివ సేనల కూటమి గెలుపు నల్లేరు మీద నడకని పండితులంతా ఊహిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన పార్టీ ఫిరాయింపులు ఇటు కాంగ్రెస్ ను అటు ఎన్సీపీని తీవ్రంగా నష్టపరిచాయి. 

Also Read:Video: మహా,హర్యానా ఎన్నికలు:బీజేపీ సీట్లు తగ్గడానికి కారణాలివే...

మహారాష్ట్ర లో బీజేపీ శివసేనల 'మహాయుతి' కూటమి కాంగ్రెస్-ఎన్సీపీల 'మహా అగాధి' తో తలపడుతోంది. దాదాపుగా 3,237మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కేవలం 235మంది మాత్రమే మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. 288 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికలకు 96,661 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసారు. పూర్తి ఎన్నికల విధుల్లో 6.5 లక్షల మంది సిబ్బంది నిమగ్నమయ్యారు. 

బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నుండి మొదలుకొని అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్ తో సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. జాతీయత నే ప్రధాన అజెండాగా బీజేపీ ప్రచారం సాగింది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారంటూ ప్రతిపక్షాలను టార్గెట్ చేసారు.