ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తన సత్తా చాటింది. రెండు స్థానాల్లో ఘన విజయం సాధించడంతోపాటు మైనారిటీ ఓట్లను చీల్చడంలో సక్సెస్ అయ్యింది. 50 స్థానాల్లో గణనీయమైన ఓట్లు సాధించి కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ కొట్టింది. కాంగ్రెస్ పార్టీ గెలుపొందే స్థానాల్లో ముస్లిం ఓట్లను చీల్చడంలో సక్సెస్ అయ్యారు. 

ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎలా ఉన్నప్పటికీ మైనారిటీ ఓట్లను చీల్చడం ద్వారా పలు పార్టీల గెలుపోటములు శాసించడంలో విజయవంతమైంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది.  

కాంగ్రెస్ పార్టీని ఆదరించే మైనారిటీలు ఎంఐఎం పార్టీ ప్రవేశంతో వార్ వన్ సైడ్ అన్నట్లుగా గంపగుత్తగా ఎంఐఎంకే ఒటేశారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ఫలితాల్లో బొక్క బోర్లా పడింది. 

హిందుత్వ కూటమిగా బీజేపీ-శివసేన కలిసి పోటీచేస్తున్న నేపథ్యంలో మైనారిటీలు సహజంగానే కాంగ్రెస్‌ పార్టీ వైపు మొగ్గుచూపుతారేమోనని అంతా భావించారు. కానీ అసదుద్దీన్ ఎన్నికల ప్రచారం, పంచ్ డైలాగులకు మంత్రముగ్థులైన ముస్లిం ఓటర్లలో అత్యధిక శాతం కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. 

కాంగ్రెస్‌కు ఓటుబ్యాంకుగా ఉన్న మైనారిటీ ఓట్లు చీలడంతో బీజేపీ-శివసేన కూటమికి వరంగా మారింది. ఎంఐఎం రంగ ప్రవేశంతో కాంగ్రెస్ పార్టీ కంచుకోటలను సైతం బీజేపీ కూటమి పాగా వేయగలిగింది. 

ఎంఐఎం పార్టీ ఈ ఎన్నికల్లో గణనీయమైన స్థానాల్లో విజయం సాధించకపోయినప్పటికీ బీజేపీ-శివసేన కూటమికి మంచి అధికారాన్ని కట్టబెట్టడంలో పరోక్షంగా సహకరించినట్లైంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లిం ఓటర్లను చీల్చడంతోపాటు కంచుకోటలను కూడా బద్ధలకొట్టి కోలుకోలేని దెబ్బతీసింది ఎంఐఎం పార్టీ.  

ఎంఐఎం పార్టీ విస్తృతంగా ప్రచారం చేయడంతో కాంగ్రెస్ పార్టీ గతంలో గెలుచుకున్న స్థానాలను కూడా దక్కించుకోలేకపోయింది. వాస్తవానికి చెప్పాలంటే ఎన్సీపీకి కంటే తక్కువ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చిందది.  

ఇకపోతే ఔరంగాబాద్‌ నియోజకవర్గంలో విజయం దిశగా ఎంఐఎం పార్టీ అభ్యర్థి నాజీర్ సిద్ధిక్వీ సంచలన విజయం సాధించారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించారు. అలాగే మరో అభ్యర్థి కూడా గెలుపొందారు. 

ఎన్నికల చరిత్రలోనే ఒక అభ్యర్థికి ఈస్థాయి ఓట్లు రావడం అనేది ఇదే తొలిసారి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఔరంగాబాద్‌ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి అయిన నాజీర్ సిద్ధిక్వీ రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధిస్తారని తెలుస్తోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

బీహార్ లో ఎంఐఎం బోణీ