దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శైలజ ద్వివేది హత్య కేసులో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి చేసుకునేందుకు అంగీకరించనందున ఆర్మీ మేజర్ నిఖిల్‌ ఆమెను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.

నిఖిల్ తనతో పాటు పనిచేసే ఉద్యోగి భార్య శైలజతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు... రెండేళ్లపాటు ఆమెతో గడిపి శైలజను పెళ్లి చేసుకోవాలని భావించాడు. అందుకు ఆమె ససేమిరా అనడంతో... బలవంతం చేశాడు. అయినా శైలజ ఒప్పుకోకపోవడంతో శైలజను చంపేయాలని నిర్ణయించాడు.

ఎలా చంపాలో తెలుసుకునేందుకు హత్య చేసే ముందు రోజు రాత్రి యూట్యూబ్‌లో శోధించాడు. హత్యా నేరం తన మీదకు రాకుండా ఉండేందుకు శైలజను కారుతో గుద్దించి యాక్సిడెంట్‌గా చిత్రీకరించాడు. దర్యాప్తులో అసలు నిజాలు వెలుగు చూడటంతో ప్రధాన నిందితుడైన ఆర్మీ మేజర్ నిఖిల్‌పై ఢిల్లీ పోలీసులు చార్జీ షీటు దాఖలు చేశారు. దీంతో నిఖిల్‌పై కేసులు నమోదు చేయాలని పటియాలా కోర్టు పోలీసులను ఆదేశించింది.