ట్రిచీ : త్రిచిలోని బిషప్ హెబెర్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ తమిళ సాహిత్య విద్యార్థులను లైంగికంగా వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అసోసియేట్ ప్రొఫెసర్‌ను బుధవారం అరెస్టు చేశారు. డిస్ట్రిక్ అడ్మినిస్టేషన్ కమిటీ వేసిన నిజనిర్థారణ కమిటీ చేసిన ఫిర్యాదు మేరకు ఈ అరెస్ట్ జరిగింది.

మహిళలతో అవమానించడం, అశ్లీలంగా మాట్లాడడం, మహిళల గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించడం లాంటి అనేక రకాల కేసుల మీద ఐపిసి, తమిళనాడుల వేధింపుల నిషేధం చట్టం కింద ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ (ఎడబ్ల్యుపిఎస్), శ్రీరంగం సిజె పాల్ చంద్రశేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు.
సిజె పాల్ తమిళ సాహిత్య విభాగం అధిపతిగా పనిచేస్తున్నాడు. అతని మీద హారాస్ మెంట్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ 1998కింద కేసులు నమోదు చేశారు. ఫిబ్రవరిలో ఆఫ్‌లైన్ తరగతుల సందర్భంగా ఎంఏ తమిళ సాహిత్య మహిళా విద్యార్థులకు బోధిస్తున్న సమయంలో ద్వంద్వార్థాలతో, అశ్లీలంగా మాట్లాడాడనిఆరోపణలు ఉన్నాయి.
ఇంట్లో చొరబడిన దొంగలు, మహిళపై ఘాతుకం, రూ.15లక్షల చోరీ..!
అరెస్టు తరువాత, అసోసియేట్ ప్రొఫెసర్‌ను జిల్లా కోర్టులో హాజరుపరిచే ముందు పోలీసులు ప్రశ్నించారు. అతన్ని జ్యుడీషియరి కస్టడీలో రిమాండ్ చేశారు. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి (డిఎస్‌డబ్ల్యుఓ), నిజనిర్ధారణ కమిటీ సభ్యుడు-తమిమ్మునిషా ఈ ఫిర్యాదు చేశారు.
ఆన్ లైన్ క్లాసుల్లో విపరీత ప్రవర్తన మీద అంతకు ముందు ఐదుగురు విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీనిమీద కళాశాల ఏడుగురు సభ్యుల ఇంటర్నల్ కమిటీని వేసి దర్యాప్తు జరిపించింది. దీని తరువాత అసోసియేట్ ప్రొఫెసర్‌ను జూన్ 30 న సస్పెండ్ చేసింది.
ఇది జరిగిన కొద్ది రోజుల తరువాత, జిల్లా యంత్రాంగం ఈ విషయం గురించి తెలుసుకుని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.