మహారాష్ట్రలోని పూణేలో దారుణం జరిగింది. ముద్దులొలికే ఓ రెండేళ్ల చిన్నారికి బిస్కెట్లు ఇస్తానని ఆశ చూపించి, నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు ఓ 25 ఏళ్ల యువకుడు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు.
అభంశుభం తెలియని పసి పాపలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్న పిల్లలను కూడా చూడకుండా వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చాకెట్లు, బిస్కెట్లు ఆశ చూపి వారిపై లైంగిక దాడులకు దిగుతున్నారు. తాజాగా మహారాష్ట్ర (Maharashtra)లోని పూణె (Pune)లో దారుణమైన ఘటన జరిగింది. 25 ఏళ్ల భవన నిర్మాణ కార్మికుడు రెండేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూణే జిల్లాలోని పింప్రి చించ్వాడ్ (Pimpri Chinchwad) పోలీసు స్టేషన్ పరిధిలోని 25 ఏళ్ల నిందితుడు నివసిస్తున్నాడు.బాధితురాలి తండ్రి, ఈ యువకుడు ఓ నిర్మాణంలో ఉన్న భవనానికి వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. అయితే సోమవారం ఆ నిర్మాణ స్థలంలో తల్లిదండ్రులు పని కోసం ఇతర ప్రాంతానికి వెళ్లారు. బాధితురాలు, ఆమె అన్నయ్య ఇంటి ముందు ఇతర పిల్లలతో ఆడుకుంటున్నారు. దీంతో నిందితుడు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆ చిన్నారికి బిస్కెట్ ఇస్తానని ఆశ చూపి తన వెంట తీసుకెళ్లాడు. నిర్మాణ స్థలం వెనుక ఉన్న ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి ఆ పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
పని కోసం బయటకు వెళ్లిన తల్లిదండ్రులు కుమారుడి దగ్గర కూతురు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. తరువాత చిన్నారి కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు నిందితుడిపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
మహారాష్ట్రలోని ముంబైలో ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. ఆరేళ్ల బాలికపై 25 ఏళ్ల వ్యక్తి 5 రోజుల పాటు పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి ప్రలోభపెట్టాడు. తరువాత తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ మైనర్ ఇంటికి వచ్చి స్నానం చేస్తున్న క్రమంలో తన ప్రైవేట్ భాగాలలో నొప్పిగా ఉందని బాధపడింది. దీంతో తల్లి ఏం జరిగిందని విచారించగా తన ఇంటికి పొరుగున ఉన్న వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. దీంతో నిందితుడి ప్రశ్నించగా తన తప్పును ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నెల ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ (Muzaffarnagar) జిల్లాలో
మూడో తరగతి చదివే 9 ఏళ్ల బాలికపై 71 ఏళ్ల వయసున్న ప్రిన్సిపాల్ లైంగిక దాడికి ఒడిగట్టాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేరానికి సంబంధించిన వివరాలను దాచిపెట్టినందుకు అదే పాఠశాల పని చేస్తున్న మరో ఉపాధ్యాయుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆ స్టూడెంట్ (student) ను ఏదో కారణంతో ప్రిన్సిపాల్ (principal) తన గదికి పిలిచాడు. ఆ చిన్నారి దుస్తులు విప్పేసి ఆమెపై లైంగిక దాడి చేశాడు. స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఆ చిన్నారికి రక్తస్రావం జరగడాన్ని తల్లిదండ్రులు గమనించారు. ఏం జరిగిందని ఆరా తీస్తే ఆ చిన్నారి జరిగిన దారుణాన్ని తెలియజేసింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.