హిమాచల్ ప్రదేశ్‌లోని (Himachal Pradesh) ఉనా జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బతు పారిశ్రామిక ప్రాంతంలోని ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. దీంతో ఆరుగురు కార్మికకులు మృతిచెందారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని (Himachal Pradesh) ఉనా జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బతు పారిశ్రామిక ప్రాంతంలోని ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. దీంతో ఆరుగురు కార్మికకులు మృతిచెందారు. దాదాపు 12 మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మంటలను అదుపులోకి తీసుకురావడినిక అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు.
అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం.. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారుు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Scroll to load tweet…
