జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది సజీవ దహనం, మృతుల సంఖ్య పెరిగే అవకాశం..!
జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ధన్‌బాద్‌లోని ఓ మల్టీ ఫ్లోర్ బిల్డింగ్‌లో మంగళవారం భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది సజీవ దహనమయ్యారు.

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ధన్‌బాద్‌లోని ఓ మల్టీ ఫ్లోర్ బిల్డింగ్‌లో మంగళవారం భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది సజీవ దహనమయ్యారు.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ధన్‌బాద్‌లోని జోరాఫటక్ ప్రాంతంలోని ఆశీర్వాద్ టవర్ వద్ద సాయంత్రం 6 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాయి.
అగ్నిప్రమాదంలో కనీసం 8 మంది మృతి చెందారు, పలువురు గాయపడ్డారు ఓ అధికారి తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. ధన్‌బాద్ డిప్యూటీ కమిషనర్ సందీప్ సింగ్ సీనియర్ పోలీసు అధికారులతో కలిసి ఘటన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. ‘‘అగ్ని ప్రమాదంలో కనీసం ఎనిమిది మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. అయితే మరణించిన, గాయపడిన వారి సంఖ్య ఇంకా ఖచ్చితంగా తెలియాల్సి ఉంది’’ అని అన్నారు.