జార్ఖండ్ లో కుటుంబకలహాల నేపథ్యంలో అత్యంత దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ఏడేళ్ల చిన్నారిని అత్యంత పాశవికంగా హత్య చేశారు.
జార్ఖండ్ : కుటుంబ కలహాలు ఓ ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు తీసాయి. చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఏడేళ్ల పసిగుడ్డు అని కూడా చూడకుండా చిన్నారి మీద యాసిడ్ పోశారు. నాలుక కోసేశారు. కళ్ళు, పళ్ళు పీకేసి అమానవీయంగా.. అతి దారుణంగా వ్యవహరించారు. ఈ చిత్ర హింసలు భరించలేక బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
చిన్నారి మృతదేహాన్ని బాలుడి బాబాయి ఇంటి వెనక గుంతలో పాతిపెట్టారు. మరుగుదొడ్డి కోసం తవ్విన గుంతలో పడేశారు. ఈ ఘటన దండాయి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చిన్నారి పేరు సంతన్ కుమార్ (7). సంతన్ తండ్రి అవధేశ్ సాహు. ఆ చిన్నారి రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. చాక్లెట్ కొనుక్కునేందుకు స్థానికంగా ఉన్న ఓ షాప్ కు వెళ్ళాడు సంతన్. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి రాలేదు.
అలా చేయడమంటే.. మైనార్టీలపై మెజారిటీ వర్గాల అభిప్రాయాలను రుద్దడమే: ఏఐఎంఐఎం అధినేత
ఎంతసేపైనా షాప్ నుంచి ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి చూశారు. ఆ తరువాత ఊర్లోని పలుచోట్ల వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. చిన్నారి కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం బాలుడి మృతదేహం వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న పాఠశాల విద్యార్థులు స్కూలుకు వెళుతూ.. సంతన్ మృతదేహం గుంతలో పడి ఉండడం గమనించారు.
వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో.. వారు పోలీసులకు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే చిన్నారిని ఇంత దారుణంగా చంపి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
