Asianet News TeluguAsianet News Telugu

Wardha Accident: ఎమ్మెల్యే కుమారుడు సహా 7గురు వైద్య విద్యార్థుల మృతి

మృతులంగా సావంగిలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నట్లు గుర్తించారు. మృతి చెందిన వారిలో గోండ్యా జిల్లా తిరోడా ఎమ్మెల్యే విజయ్ కుమారుడు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కారులోని వారిని కాపాడాలని ప్రయత్నించినా అప్పటికే వారందరూ మృతి చెందినట్లు స్థానికులు వెల్లడించారు. 

Seven medical students including bjp MLAs son killed in road mishap in Maharashtra
Author
Hyderabad, First Published Jan 25, 2022, 9:22 AM IST

మహారాష్ట్ర : Maharashtraలో ఘోర Road accident జరిగింది. వార్థా జిల్లాలో వంతెన పైనుంచి car కింద పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు Medical students దుర్మరణం పాలయ్యారు. యావత్ మాల్ నుంచి వార్థాకు వెడుతుండగా సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి వంతెన పై నుంచి కిందపడినట్లు స్థానికులు తెలిపారు. 

మృతులంగా సావంగిలోని Medical Collegeలో ఎంబీబీఎస్ చదువుతున్నట్లు గుర్తించారు. మృతి చెందిన వారిలో గోండ్యా జిల్లా తిరోడా ఎమ్మెల్యే విజయ్ కుమారుడు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కారులోని వారిని కాపాడాలని ప్రయత్నించినా అప్పటికే వారందరూ మృతి చెందినట్లు స్థానికులు వెల్లడించారు. 

వీరంతా సెల్సురా మీదుగా వెళుతుండగా, వారి కారు ముందుకు అకస్మాత్తుగా ఒక అడవి జంతువు వచ్చింది. దానిని తప్పించే క్రమంలో స్టీరింగ్ ను బలంగా తిప్పడంతో.. కారు అదుపుతప్పి కల్వర్టు కింద ఉన్న గుంతలో పడిపోయింది. అనుకోని ఈ ఘటననుంచి తేరుకునే లోపే కారులోని ఏడుగురు విద్యార్థులు మృతి చెందారని తమ ప్రాథమిక విచారణలో తేలిందని వార్ధా ఎస్పీ ప్రశాంత్ హోల్కర్ తెలిపారు.మిగతావారిని నీరజ్చౌ హాన్, నితేష్ సింగ్, వివేక్ నందన్, ప్రత్యూష్ సింగ్, శుభమ్ జైస్వాల్, పవన్ శక్తిగా గుర్తించారు.

ఇదిలా ఉండగా, జనవరి 22న ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలాసోర్ జిల్లాలోని సోరో పోలీసు స్టేషన్ పరిధిలో NH-16‌పై బిదు చక్ వద్ద బస్సును బొగ్గు లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ‘శాంతిలత’ అనే పేరుతో ఉన్న బస్సు Mayurbhanj districtలోని మనత్రి నుంచి ఉడాలా మీదుగా భువనేశ్వర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

శనివారం మధ్యాహ్నం సమయంలో సోరో సమీపంలోని బస్ స్టాప్ వద్ద బస్సు ఆగి ఉన్న సమయంలో.. బొగ్గుతో కూడి ట్రక్కు వేగంగా దూసుకొచ్చి వెనకాల నుంచి బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపై నుంచి పక్కకు పడిపోయింది. దీంతో ఘటన స్థలంలోనే ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతిచెందారు. మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉన్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని సోరోలోని ఆస్పత్రి, బాలసోర్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. 

మరో ప్రమాదంలో.. సంక్రాంతి పండగ వేళ కర్ణాటకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని దావణగెరె జిల్లా జగలూరు తాలూకాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. కననకట్టే గ్రామం వద్ద  NH-50పై జనవరి 14 ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మొత్తం కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందారు. ప్రమాదం జరిగిన స్థలంలోనే ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరోకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు.

Follow Us:
Download App:
  • android
  • ios