చత్తీస్ ఘడ్ లో భారీ ఎన్కౌంటర్, ఏడుగురు మావోల మృతి

seven maoists Killed In  Chhattisgarh  Encounter
Highlights

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల కాలంలో భారీ ఎత్తున మావోయిస్టుల ఏరివేతను చేపడుతున్న భద్రతాదళాలు తాజాగా మరో భారీ ఎన్కౌంటర్ చేపట్టారు. చత్తీస్ ఘడ్ లో  పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు.

ఇవాళ ఉదయం ఆరుగంటల సమయంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో అప్రమత్తమైన మావోలు పోలీసులపై కాల్పులకు దిగారు. వెంటనే భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులు చేపట్టాయి. ఈ ఎన్కౌంటర్ లో ఏడుగురు మావోలు మృతిచెందారు. వీరిలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.

ఈ ఎన్కౌంటర్ బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని తిమినర్ మరియు పుస్నార్ గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. డిస్ట్రిక్ రిజర్వుడ్  గార్డ్స్(డి ఆర్ జి) మరియు స్పెషల్ టాస్క్ పోర్స్ పోలీసులు జంటగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు యాంటి నక్సల్స్ ఆపరేషన్స్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.  నక్సల్స్ స్థావరాల నుంచి రెండు ఇన్సాస్ రైఫిళ్లు, రెండు 303 రైఫిళ్లు, ఒకటి 12 బోర్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో ఇంకా మావోయిస్టులకోసం గాలింపు కొనసాగుతున్నట్లు ఐజీ తెలిపారు.

loader