న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరానికి ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. 

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మనీ లాండరింగ్, అవినీతి ఆరోపణలు మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన డిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సీబీఐ, ఈడీలు చిదంబరం బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకించాయి.ఈ విషయమై ఈ ఏడాది జనవరి 25 వాదనలు పూర్తయ్యాయి.వాదనలు ముగిసిన తర్వాత నిర్ణయాన్ని రిజర్వ్ లో పెట్టారు జడ్జి  సునీల్ గౌర్.  ఇవాళ ఈ విషయమై కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది.

2007లో   విదేశాల నుండి  రూ. 305 కోట్లను ఎఫ్ఐపీబీ మీడియా గ్రూప్ పొందింది. ఆ సమయంలో చిదంబరం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్ చేయవద్దని ఢిల్లీ హైకోర్టు 2018 జూలై 25 వ తేదీన ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను టైమ్ టూ టైమ్ పొడిగించారు.