మంగళూరు: పేరు మోసిన సీరియల్ కిల్లర్ సైనైడ్ మోహన్ కు 2006లో కేరళలోని కాసరగడ్ లో 23 ఏళ్ల బాలిక హత్య కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇది సైనైడ్ మోహన్ కు సంబంధించి 19వ హత్య కేసు. అతనిపై 20 హత్య కేసులు నమోదయ్యాయి.

ఇతర కేసుల్లోని జైలు శిక్షలు అనుభవించిన తర్వాత ఈ కేసులోని జీవిత ఖైదు ప్రారంభమవుతుందని ఆరో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సయీదున్నీసా చెప్పారు. మహిళలతో సాన్నిహిత్యం పెంచుకుని వారిపై అత్యాచారం చేసి సైనైడ్ ద్వారా వారిని చంపుతూ వచ్చాడు. ఇలా 20 మంది మహిళలను అతను హత్య చేసినట్లు కేసులు నమోదయ్యాయి. 

ఐదు కేసుల్లో అతనికి మరణశిక్ష పడగా, మూడు కేసుల్లో జీవిత ఖైదు పడింది. వాటిలో రెండు మరణశిక్షలను జీవిత ఖైదు కిందికి మార్చారు. 

చార్జిషీట్ ప్రకారం తాజా కేసు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాంప్కో యూనిట్ పని కోసం వెళ్తున్న ఓ మహిళను అతను కలిశాడు. ఆమెతో స్నేహం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. 2006 జనవరి 3వ తేదీన మైసూరుకు తీసుకుని వెళ్లి బస్సు స్టాండ్ సమీపంలోని లాడ్జిలో బస చేశాడు. 

మిగతా కేసుల్లో మాదిరిగానే మర్నాడు తెల్లవారు జామున నగలు తీసేయాలని ఆ మహిళకు చెప్పాడు. ఇద్దరు కలిసి బస్ స్టాండ్ కు వెళ్లాడు. ఓ మాత్ర ఇచ్చి వేసుకోమని చెప్పాడు. అది సైనైడ్ పూత పూసిన మాత్ర. ఆ విషయం మహిళకు తెలియదు.

ఆ మాత్ర వేసుకున్న మహిళ వాష్ రూంకు వెల్లి అక్కడే పడిపోయింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా మరణించినట్లు వైద్యులు తేల్చారు ఎప్పటిలాగా అతను లాడ్జికి వెళ్లి నగలన్నీ తీసుకుని పరారయ్యాడు. 

అతన్ని పోలీసుుల 2009లో బంట్వాల్ లో అరెస్టు చేశారు. దాంతో అతను 20 మంది మహిళలను అలాగే చెప్పినట్లు తేలింది.