భువనేశ్వర్: కరోనా బారిన పడి గతకొద్ది రోజులుగా చికిత్స పొందిన ఒడిశాకు చెందిన ఓ ఎమ్మెల్యే రెండురోజుల క్రితమే రికవరీ అయ్యారు. అయితే ఆదివారం మళ్లీ అతడు తీవ్ర అనారోగ్యానికి గురయి మృతిచెందాయి. ఇలా కరోనా బారినుండి బయటపడ్డా సదరు ఎమ్మెల్యే ప్రాణాలు మాత్రం దక్కలేదు.

వివరాల్లోకి వెళితే... ఒడిషా అధికార పార్టీ బిజూ జనతా దళ్ ఎమ్మెల్యే ప్రదీప్ మహారథి(65)కి గత నెల సెప్టెంబర్ 14న కరోనా నిర్దారణ అయ్యింది.  అప్పటినుండి ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందిన ఆయన కోలుకుని రెండు రోజుల క్రితమే డిశ్చార్జి అయ్యారు. 

read more కరోనా ఎఫెక్ట్: ఢిల్లీలో అక్టోబర్ 31వ తేదీ వరకు స్కూల్స్ మూత

అయితే ఇంటికి చేరుకున్న రెండు రోజుల్లోనే మళ్లీ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. కుటుంబసభ్యులు ఎమ్మెల్యేను హుటాహుటిని మళ్లీ  హాస్పిటల్ కు తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో మహారథి ఆదివారం ఉదయం మృత్యువాతపడ్డారు. 

పూరి జిల్లాలోని పిపిలి నియోజకవర్గం నుండి మహారథి ఏడుసార్లు విజయం సాధించారు. సీనియర్‌ ఎమ్మెల్యే ప్రదీప్‌ మహారథి మృతిపట్ల ఒడిశా గవర్నర్‌ గణేషి లాల్‌, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.