న్యూఢిల్లీ: సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మాద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత  అహ్మాద్ పటేల్ కు కరోనా సోకింది.  దీంతో ఆయన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు. న్యూఢిల్లీలోని మేదాంత ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకొంటున్నాడు.

 

కరోనా బారినపడిన పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను ఐసీయూలో చేర్పించారు.ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీన అహ్మాద్ పటేల్ కు కరోనా సోకింది. ఆయన వయస్సు 71 ఏళ్లు. ఈ విషయాన్ని అహ్మద్ పటేల్ తనయుడు ఫైసల్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించాడు. 

అహ్మాద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన తెలిపాడు. పటేల్ త్వరగా కోలుకోవాలని  ప్రార్ధించాలని ఆయన కోరాడు.ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ కారణంగా అహ్మద్ పటేల్ ఇబ్బందిపడుతున్నాడని  వైద్యులు చెప్పారు.

అహ్మార్ పటేల్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుపుతామని ఫైసల్ పటేల్ తెలిపారు.