Asianet News TeluguAsianet News Telugu

‘దేశద్రోహ చట్టం’పై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. !

"దేశద్రోహ చట్టం ఒక వలసవాద చట్టం. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం తరువాత మన దేశంలో ఇంకా ఈ చట్టం అవసరమా" అని ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ప్రశ్నించారు.

Sedition Law Colonial, Says Supreme Court, Will Examine Its Validity - bsb
Author
Hyderabad, First Published Jul 15, 2021, 12:44 PM IST

ఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని "వలసచట్టం" గా అభివర్ణించిన సుప్రీంకోర్టు "75 సంవత్సరాల స్వాతంత్ర్యం తరువాత ఇంకా అవసరమా" అని ప్రశ్రించింది. ఈ చట్టం ద్వారా సంస్థల పనితీరుకు తీవ్రమైన ముప్పు  ఉందని, ఇది దుర్వినియోగం చేయడానికి "అపారమైన శక్తిని"గా వాడబడుతోందని వ్యాఖ్యానించింది.

దేశద్రోహ చట్టం ప్రామాణికతను పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది. ఓ మాజీ ఆర్మీ ఆఫీసర్ ఈ చట్టం మీద వేసిన  పిటిషన్ పై స్పందించాలని కేంద్రాన్ని కోరింది. ఈ చట్టం మట్లాడటం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని, వాక్ స్వాతంత్ర్యాన్ని, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటుందని అందులో పేర్కొన్నారు. 

"దేశద్రోహ చట్టం ఒక వలసవాద చట్టం. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం తరువాత మన దేశంలో ఇంకా ఈ చట్టం అవసరమా" అని ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ప్రశ్నించారు.

"వివాదం ఇది ఒక వలసవాద చట్టం, అదే చట్టాన్ని బ్రిటిష్ వారు గాంధీజీ నోరు నొక్కడానికి ఉపయోగించారు." అని గుర్తు చేశారు. ఈ దేశద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ  అనేక పిటిషన్లు వచ్చాయని, అన్నీ కలిసి విచారించనున్నట్లు కోర్టు తెలిపింది.

"మా ఆందోళన అంతా చట్టాన్ని దుర్వినియోగం చేయడం, ఎవరిమీద ప్రయోగించినా జవాబుదారీతనం లేకపోవడం" అని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.

సంస్థల పనితీరుకు ఈ చట్టం "తీవ్రమైన ముప్పు" అని సుప్రీంకోర్టు పేర్కొంది. "ఈ చట్టం దుర్వినియోగం కావడానికి చాలా అవకాశాలున్నాయి. దీన్ని... వడ్రంగి చెక్కముక్కకోసం అడవిని నరికినట్టుగా ఉంటుందని.. అలాగే ఈ చట్టం కూడా ప్రభావితం చేస్తుందని’’ అని ప్రధాన న్యాయమూర్తి రమణ అన్నారు.

పిటిషనర్, మేజర్-జనరల్ (రిటైర్డ్) ఎస్.జి. వోంబాట్కేర్, దేశద్రోహ నేరానికి సంబంధించిన భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 124-ఎ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, "నిస్సందేహంగా కొట్టివేయాలని" వాదించారు.

ప్రధాన న్యాయమూర్తి రమణ, ఎ.ఎస్.బొపన్న, హృషికేశ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం ఆయన పిటిషన్ను విచారించింది. ఇది '' ప్రభుత్వం పట్ల అసంతృప్తి '' రాజ్యాంగ విరుద్ధంగా అస్పష్టమైన నిర్వచనాలతో వ్యక్తీకరణలను నేరంగా పరిగణించే ఏ చట్టమైనా స్వేచ్ఛా భావ వ్యక్తీకరణ అనే ప్రాథమిక హక్కును కాలరాయడమేనని పేర్కొంది.

సెక్షన్ 124-ఎతో డీల్ చేసేముందు.. ఈ చట్టం ఏ కాలంలో అమల్లోకి వచ్చిందో.. దాన్ని ఎందుకు డెవలప్ చేశారో పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉందని పిటిషన్ పేర్కొంది.

దేశద్రోహ చట్టాన్ని సవాలు చేస్తూ ఇద్దరు జర్నలిస్టులు వేసిన పిటిషన్‌పై స్పందించాలని అంతకుముందు ఉన్నత కోర్టు ప్రత్యేక ధర్మాసనం కేంద్రాన్ని కోరింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios