జనవరి 24 నుంచి మహారాష్ట్రలో స్కూళ్లు ప్రారంభించేందుకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే అనుమతి ఇచ్చారు. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అధికారం స్థానిక అధికారులకే కల్పించారు.
మహారాష్ట్రలో (maharasta) స్కూళ్లు తిరిగి ప్రారంభించనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే (cm udhav takre) ప్రకటించారు. ఈ మేరకు గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో స్కూళ్లు ప్రారంభించాలనే ప్రతిపాదనకు ఆయన ఆమోదం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జనవరి 24 (సోమవారం) నుంచి ఆఫ్ లైన్ క్లాసులు కొనసాగుతాయని చెప్పారు. ఈ నిర్ణయం 1 నుండి 12 తరగతుల వారికి వస్తుందని ప్రకటించారు.
వివిధ రంగాల నిపుణులతో చర్చించిన తరువాత మాహారాష్ట్రలో స్కూల్స్ (schools) ప్రారంభించాలని నిర్ణయం తీసకున్నామని మహారాష్ట్ర విద్యా శాఖ మంత్రి వర్ణా గైక్వాడ్ (varna gaikwad) తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. యథావిధిగా స్టూడెంట్లు మళ్లీ స్కూళ్లకు రావొచ్చని తెలిపారు. మహారాష్ట్రలోని స్కూళ్లు జనవరి 27, 2022 నాటికి ప్రారంభించవచ్చని పలు నివేదికలు సూచించాయి. స్కూడెంట్లు స్కూళ్లకు వెళ్లకపోవడం వల్ల నేర్చుకోవడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తిరిగి వాటిని మొదలు పెట్టే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని పేరెంట్స్ అసోసియేషన్, పలువురు మంత్రులు సీఎం ఉద్దవ్ ఠాక్రేకు, సీఎంవోకు ప్రతిపాదనలు అందించారు. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న సీఎం స్కూళ్లు మొదలు పెట్టడానికి అనుమతి ఇచ్చారు.
కరోనా థర్డ్ వేవ్ (corona third wave) కారణంగా మహారాష్ట్రతో పాటు చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. అయితే ఈ సమయంలో మూతబడిన స్కూళ్లు తెరవడానికి అనుమతి ఇచ్చిన రాష్ట్రాల్లో దేశంలోనే మహారాష్ట్ర మొదటిది. 2022 జనవరి మొదటి వారం నుంచే అనేక రాష్ట్రాల్లోని స్కూళ్లు, కాలేజీలు విడతల వారీగా మూసివేతకు గురయ్యాయి. అయితే ఆన్ లైన్ క్లాసులను కొనసాగిస్తున్నారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లు తెరవడానికి అనుమతి ఇచ్చినప్పటికీ.. ఈ విషయం తుది నిర్ణయం తీసుకునే అధికారం స్థానిక అధికారులకు ఇచ్చేరు. అంటే కేసులు అధికంగా ఉన్న బృహణ్ ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్ (bmc) వంటి ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో స్థానిక అసవరాలను బట్టి స్కూళ్ల మూసివేత, ప్రారంభం వంటి నిర్ణయాలు అక్కడి అధికారులే తీసుకోవచ్చు.
మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 43,697 కోవిడ్ -19 (covid - 19) కొత్త కేసులు నమోదయ్యాయి, మంగళవారం కంటే ఇది 10 శాతం ఎక్కువ, ఇందులో 214 కొత్త ఒమిక్రాన్ (omicron) ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. బుధవారం రోజు కరోనా (corona) వల్ల 49 మరణాలు సంభవించాయి. ఈ మేరకు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అయితే గత 24 గంటల్లో మొత్తం 46,591 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు, దీంతో రాష్ట్రం మొత్తం రికవరీ సంఖ్య 69,15,407కి చేరుకుంది. మహారాష్ట్రలో కోవిడ్-19 రికవరీ రేటు 94.4 శాతంగా ఉంది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో 23,93,704 మంది, ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌లో 3,200 మంది ఉన్నారు. అయితే ఇందులో ముంబైలో 6,032 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. 12 మరణాలు సంభవించాయి. అలాగే కోవిడ్ -19 నుంచి 18,241 మంది కోలుకున్నారు.
